Take a fresh look at your lifestyle.

సంక్రాంతి

రైతు పండించిన పంట
ఇంటికి చెరుకున్న సందర్భంలో
బంధు మిత్రులు
కలుసుకుని ఆనందంగా
జరుపుకునే మూడు రోజుల
పండుగ  సంక్రాంతి
ఆడపడుచుల రాకతో
ఇల్లు పూర్వ వైభవంతో
కళకళలాడుతూ పిల్లలతో
సందడిగా మారింది
అవ్వ చేసిన సకినాలు
అమ్మ కాసిన పాయసం
గుమ గుమ లాడుతున్నాయి
భోగి రోజు నువ్వుల నునెతో
తల స్నానము చేసి
నవ ధాన్యాలతో
వాకిట్లో గొబ్బెమ్మలు
మకర సంక్రాంతి లో
గంగిరెద్దుల విన్యాసం
హరికీర్తనలు
కనుమ నాడు
కొత్త అల్లుల రాకతో
విందులలో కుటుంబాలు
సంక్రాంతి వచ్చి సరాదాలు తెచ్చె

– మిద్దె సురేష్‌
9701209355

Leave a Reply