దేశ ప్రధానమంత్రి మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు జిల్లా ప్రజలంతా దీపాలు వెలిగించాలని మంత్రి హరీష్ రావు కోరారు. కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసిన మహమ్మారి పై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని ఆకాంక్షించారు.. జనతా కర్ఫ్యూ రోజున చప్పట్లతో చాటి చెప్పిన స్ఫూర్తిని మరోసారి ప్రతి ఇంటి ముందు, బాల్కనీలో దీపాలతో ప్రదర్శించాలని కోరారు. మనందరి ఐక్యతకు అద్ధం పట్టే విధంగా నలు దిశలా వెలుగులు విరాజిమ్మలని పిలుపునిచ్చారు.