Take a fresh look at your lifestyle.

సంకల్ప దీపావళి !!

ఇది సంబరాల దీపావళి
నరకాసురుడు అంటే
సాక్షాత్తూ కొరోనాసురుడే !
ఆ విలయతాండవంలో వివశులై
అసువులు బాసారెందరో..
చీకట్లను చీల్చే చుక్కల్లాంటి
దీపాలే వైద్యులై
చంద్రుణ్ణి కరిగించి పోసినట్టు
వెలుగులు చిమ్మే మతాబులే
పోలీసు యోధులై
చీపుర్లను చిచ్చుబుడ్లలా
వెలిగించే సఫాయిలే సిపాయిలై
వెలుగుల పోరాటం సాగించి గెలిచేరు !
సంకల్ప బాణాలతో.. మృత్యు
గీతమాలాపిస్తున్న కరోనాని
పరిమార్చడంలో సామాన్యుడిదీ
చరితార్థమైన పాత్రే !
గృహనిర్బంధనాల్ని అస్త్రశస్త్రాలుగా
మాస్కుల్ని భౌతికదూరాల్ని
యుద్ధప్రణాళికలుగా మల్చుకొని
కనిపించని శత్రువుతో కడదాకా
పోరాడి నిలిచి ఈ దీపావళిని
ఆనందావళిగా వెలుగులు చిమ్మించేది
అతడి ధైర్యమే.. సంకల్పమే.. !!

– భీమవరపు పురుషోత్తం
9949800253

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply