Take a fresh look at your lifestyle.

జూన్‌ 1 ‌నుండి సానిటేషన్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహించాలి

జూన్‌ 1 ‌నుండి 8 వ వరకు అన్ని మున్సిపాలి టీలలో ఇంటెన్సివ్‌ ‌సానిటేషన్‌ ‌డ్రైవ్‌ ‌పక్కడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభి వృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ అరవింద్‌ ‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన మున్సిపల్‌ ‌సంచాలకులు డాక్టర్‌ ‌సత్యనారాయణతో కలసి మునిసిపల్‌ ‌కమిషనర్‌లు, అదనపు కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆరవింద్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ కొనసా గుతున్న కొరొనా మహమ్మారి రాబోయే వర్షా కాలంలో మలేరియా, విరేచనాలు, గ్యాస్ట్రో ఎంటెరిటిస్‌, ‌డెంగ్యూ, టైఫాయిడ్‌, ‌చికున్‌ ‌గున్యా వైరల్‌ ‌జ్వరం వంటి కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్యాన్ని కాపాడ టానికి ఇంటెన్సివ్‌ ‌శానిటేషన్‌ ‌డ్రైవ్‌-2020 ‌ద్వారా పూర్తి పారిశుధ్య కార్యకలాపాలు నిర్వహించి వ్యాధుల నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారన్నారు. పేరుకుపోయిన చెత్త ప్రాంతాలను గుర్తించి డంప్‌లను క్లియర్‌ ‌చేయాలని, ఇంటెన్సివ్‌లాంటి లార్వా స్ప్రేయింగ్‌ ‌చేపట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు రోడ్లపై ఉండకుండా గుర్తించి తొలగించాలని ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో, రోడ్లపై, స్లమ్‌ ‌ప్రాంతాలను గుర్తించి వర్షపు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని పబ్లిక్‌ ‌టాయిలెట్స్ ‌శుభ్రంగా ఉంచడంతో పాటు జూన్‌ ‌చివరి నాటికి కొత్త పబ్లిక్‌ ‌టాయిలెట్స్లను నిర్మించాలని అన్నారు. పెద్ద మురుగు కాలువలలో పూడిక చెత్తా తీత చేయాలని తెలిపారు.

ఖాళీ ప్లాట్‌ ‌లను గుర్తించి పిచ్చి చెట్లను, పొదలను తొలగించాలన్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్‌ ‌లను భాగస్వాములు చేస్తూ ఇండ్లతో పాటు అపార్ట్మెంట్స్, ‌ప్రార్థన మందిరాలు, కమర్షియల్‌ ‌కాంప్లెక్స్ ‌సంఘాలలో అవగాహన కల్పించి పరిశుభ్రత చేయించాలని కోరారు. రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్యనారా యణ మాట్లాడుతూ జూన్‌ 1 ‌నుండి వారం రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌పక్కగా నిర్వహణకు అన్ని సమకూర్చు కోవాలని అన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయుటకు బ్యానర్లు, కరపత్రాలు ముద్రించాలని కోరారు. మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతి మాట్లాడుతూ సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా గత నెలన్నర నుండి మురుగు కాలువల పూడిక, చెత్తా తీయడం జరుగుతున్నదని, పట్టణ ప్రగ తిలో గుర్తించిన ఖాళీ ప్లాట్లను శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. గత 3 వారాల నుండి ప్రతి ఆదివారం10 గంటలకు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్‌ ‌లను భాగస్వామ్యం చేస్తూ పెద్దఎత్తున చేసామని, కాలనీ అభివృద్ధి, పచ్చదనం పారిశుద్ధ్య కొరకు కృషి చేసిన వార్డ్ ‌కమిటీ సభ్యులు, సీనియర్‌ ‌సిటిజన్‌ ‌లను సన్మానించామన్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ నగర వాసులలో అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంటికి స్టిక్కర్‌ ‌లు అంటింస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ‌తన వాహనానికి అవగాహన స్టిక్కర్‌ అం‌టించి, అన్ని ప్రభుత్వ వాహనాలకు అంటించాలని అదేశించారని కమిషనర్‌ ‌తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లో అదనపు కలెక్టర్‌ ‌దాయానంద్‌, అదనపు కమిషనర్‌ ‌నాగేశ్వర్‌, ఎస్‌ఈ ‌భాస్కర్‌ ‌రెడ్డి, బల్దియా అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply