Take a fresh look at your lifestyle.

సానిటేషన్‌ ‌సిబ్బంది పనితీరులో మార్పు కనపడాలి బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి

Sanitation, difficulty, should change, performance, Baldiya Commissioner

నెల రోజుల్లో శానిటేషన్‌ ‌సిబ్బంది పనితీరులో మార్పు కనిపించాలని బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో సానిటరీ ఇన్స్పెక్టర్‌లు, జవాన్‌లతో సమీక్ష సమావేశం అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది కుటుంబ సమస్యలను పని విషయంతో ముడి పెడుతున్నారని, తాను కూడా ఇటీవల నూతన సంవత్సర వేడుకలు తన కుటుంబముతో కలిసి జరుపుకోవాల్సి ఉండేనని కానీ సానిటేషన్‌ ‌సిబ్బందితో కలిసి జరుపుకున్నానని గుర్తు చేశారు. సిబ్బంది డ్యూటీకి హాజరు కాని పక్షంలో జవాన్‌లు కూడా స్వీపింగ్‌ ‌చేయాలని, పనిచేయాలనే కాంక్షవుండాలని అవసరమైతే తాను కూడా స్వీపింగ్‌ ‌చేస్తానని, త్వరలో మీరే చూస్తారని కమీషనర్‌ అన్నారు. బయోమెట్రిక్‌ ‌మిషన్‌లో హాజరు నమోదు చేసి పనిచేయకుండా వెళ్లిపోయే వారు చాలామంది ఉన్నారని అలాంటి వారు తమ పని విధానంలో మార్పులు చేసుకోవాలని కమిషనర్‌ ‌సూచించారు. రోజూ ఉదయం 5 గంటలకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉండాలని తాను కూడా ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతానన్నారు. వృద్ధాప్యంలో ఉన్న అవుట్సోర్సింగ్‌ ‌సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగిందని ఖచ్చితంగా ఫీల్డ్‌లో పని చేయాల్సిందేనని కమిషనర్‌ ‌స్పష్టం చేశారు. లేకుంటే సస్పెండ్‌ ‌చేయడానికి కూడా వెనుకాడనన్నారు. సిబ్బంది హాజరుకు సంబంధించి ఫింగర్‌ ‌ప్రింట్‌లు నమోదు చేసి విధులకు హాజరు కాకుంటే జవాన్ల పైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వందశాతం డోర్‌ ‌టు డోర్‌ ‌చెత్త సేకరణ జరగాలని, జవాన్లు, సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా సూచించాలని ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని చెత్తను వేరు చేసి అందించే బాధ్యత సిటిజన్‌ ‌లపై ఉంటుందని వారు సహకరించకుంటే వారి ఇంటి నెంబర్‌లు సేకరించి సంబంధిత డివిజన్‌ ‌కార్పొరేటర్‌కి సమాచారం అందజేసి వారిలో చైతన్యం కలిగించాలని కమిషనర్‌ ఉన్నారు.

- Advertisement -

స్వచ్ఛ ఆటోలు వెళ్లలేని చిన్నచిన్న గల్లీలను గుర్తించి సమగ్ర సమాచారాన్ని అందజెయాలని, పారిశుద్ధ్య కార్మికులు ఖచ్చితంగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని అవసరమైతే బూట్లు కొనుగోలు చేసి అందజేస్తామని కమిషనర్‌ అన్నారు. తాను ప్రతిరోజు వివిధ డివిజన్లను పర్యటించడం జరుగుతుందని పర్యటించే క్రమంలో తమని తాము పరిచయం చేసుకోవాలని లేకుంటే వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఇందుకు సంబంధించిన నమూనాను తయారు చేయాలని ఎం.హెచ్‌.ఓ.‌ను ఆదేశించారు. కన్స్ట్రక్షన్‌ ‌డేబ్రిస్‌(‌సి.బి.డి)ను సంబంధిత గృహ యాజమాన్యమే తరలించాలని అలా తొలగించకపోతే సంబంధిత కార్పొరేటర్‌కి సమాచారం ఇవ్వాలని, ఐనను తొలగించకపోతే నోటీసులు అందజేయాలని,58 డివిజన్‌ ‌ల వారిగా ఒక రిజిస్టర్‌ ‌నిర్వహించాలని కమీషనర్‌ అన్నారు. స్వచ్ఛ ఆటో దారులు ఏ పాయింట్‌ ‌నుండి ఏ పాయింట్‌ ‌వరకు వెళ్తారు అనే జాబ్‌ ‌చార్ట్ ‌రూపొందించాలని అన్ని విషయాలు సమగ్రంగా జవాన్‌ ‌లు నమోదు చేయాలని అన్నారు. సానిటేషన్‌ ‌సిబ్బంది డివైడర్‌ ‌లో మధ్యలో ఉన్న చెత్తను తీసి మధ్యలో వేయడం వల్ల గ్రీనరీ దెబ్బతింటుందని డివైడర్‌ ‌ల మధ్యలో దుమ్ము,మట్టి పేరుకు పోయి ఉన్నట్లయితే సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్‌ ‌కి షోకాజ్‌ ‌నోటీసు జారీ చేయబడుతుంది అని కమీషనర్‌ అన్నారు. ఇటీవల కార్పొరేషన్‌ ‌కు రెండు డి.ఆర్‌.ఎఫ్‌ (‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ ‌వాహనాలు) ను సమకూర్చుకోవడం జరిగిందని ఇందుకోసం ప్రత్యేకంగా యూనిఫామ్‌ ‌కోడ్‌ ‌తో సిబ్బందిని కూడా నియమించడం జరిగిందని, ఇందుకోసం ప్రత్యేక జాబ్‌ ‌చాట్‌ ‌తయారుచేయాలని, ప్రత్యేక టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌,‌ఫోన్‌ ‌నంబర్‌ ఉం‌దని అట్టి నంబర్‌ ‌ను జవాన్లు, సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేయాలని, అట్టి ఫోన్‌ ‌నెంబర్‌ ‌కి ఫోన్‌ ‌చేయడం వల్ల ఏలాంటి సౌకర్యాలను పొందవచ్చో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత జవాన్లదే నని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌-2020 ‌పోటీల్లో నగరం పాల్గొననున్నందున ఇందుకోసం ప్రత్యేకంగా 1500 మార్కులతో సిటిజన్‌ ‌ఫీడ్‌ ‌బ్యాక్‌ ఇవ్వాల్సి ఉన్నందున ఏ విధంగా సిటిజన్‌ ‌ఫీడ్‌ ‌బ్యాక్‌ ఇవ్వలో ప్రజలను చైతన్యవంతం చేసేలా సాంకేతిక నిపుణులు సురేష్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ‌కూడా తన మొబైల్‌ ‌ద్వారా సిటీజన్‌ ‌ఫీడ్‌ ‌బ్యాక్‌ అం‌శాలలో తన అభిప్రాయాలను నమోదుచేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌.ఎఫ్‌.ఓ. ‌జి.వి.నారాయణ రావు, ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి, సుపరిండెంట్‌ ‌షేహజాది బేగం, సానిటరీ సూపర్‌ ‌వైసర్‌ ‌సుధాకర్‌, ‌సానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్‌ ‌లు తదితరులు పాల్గొన్నారు.

Tags: Sanitation, difficulty, should change, performance, Baldiya Commissioner

Leave a Reply