Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అభినందనీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి

కొరోనా వైరస్‌ ‌మహమ్మారినీ అరికట్టే ప్రక్రియలో గ్రామాలను పట్టణాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్న జీహెచ్‌ఎం‌సీ, మున్సిపల్‌, ‌గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని, వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామచంద్రాపురం సండే మార్కెట్లో జీహెచ్‌ఎం‌సీ పారిశుధ్య సిబ్బందికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకీ ప్రబలుతున్న కరోనా వైరస్‌ ‌విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

నియోజకవర్గంలో నిరుపేదలకు వలస కూలీలకు ప్రభుత్వం తరఫున 12 కిలోల ఉచిత రేషన్‌ ‌బియ్యం నగదు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నిత్యం నియోజకవర్గంలో ఏదో ఒక చోట నిత్యావసర సరుకుల పంపిణీ ఉచిత భోజన వసతి తదితర కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ ఉండటం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి విపత్కర సమయం లోనే ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు అండగా నిలవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తొంట అంజయ్య యాదవ్‌, ‌వి.సింధు ఆదర్శ్ ‌రెడ్డి, నాయకులు బి.విజయ్‌ ‌కుమార్‌, ‌బి.పుష్ప నగేష్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply