Take a fresh look at your lifestyle.

సమత కేసులో ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన ఫాస్ట్ట్రాక్ కోర్టు..

Samatha accusedముగ్గురు నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుమ్

సమత కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ 24న కుమ్రం భీం జిల్లాలో సమతపై షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌ అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 27న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా.. నేడు ఆదిలాబాద్ కోర్టు హాల్‌లో… నేరం రుజువైందని నిందితులకు న్యాయమూర్తి ప్రియదర్శిని తెలిపారు. అయితే తామే కుటుంబానికి ఆధారమని నిందితులు జడ్జి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. శిక్ష విషయంలో కనికరం చూపాలని నిందితులు వేడుకున్నారు. మీరు చేసిన పని చాలా ఘోరమైనదని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. దారుణంగా అత్యాచారం చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

Tags: samatha rape case, fastrack court, accuses, lingapur

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply