Take a fresh look at your lifestyle.

గిరిజన ఇలవేల్పుల కొలువు: సమ్మక్క-సారలమ్మ జాతర

“జాతరలో పాల్గొనడానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలే కాకుండా, ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. పూర్వం ఈ జాతరను కోయలు మాత్రమే జరుపుకునేవారు. సమ్మక్క సారలమ్మలు కోట్లాది మందికి ఇలవేల్పులు! అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారిని భక్తజనుల కోరికల నెరవేర్చు దేవతామూర్తులుగా కొలుస్తారు.మాఘ శుద్ధ పూర్ణిమ నాడు జరిగే ఉత్సవం. భవిష్య సమ్మక్క సారలమ్మలను చెరొక సంవత్సరానికి రక్షక దేవతలుగా భావించి, వారి గౌరవార్థం ఒకేసారి ఈ జాతరలో కొలుస్తారు. కాకతీయుల కాలం నాటికి ఇదొక రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతగల ఉత్సవం కావడం వలన కూడా ఈ భారీ ఉత్సవాన్ని రెండేళ్లకు ఒకసారి నిర్వహించే సాంప్రదాయాన్ని పాలకులు నిర్దేశించి ఉంటారు.”

sammakka Saralamma Maha jatara is the largest tribal community in Asia

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మహాజాతర. కాకతీయ రాజులను ఎదిరించి చరిత్రకెక్కిన సమ్మక్క, సారలమ్మలు గిరిజన వీరవనితలుగా, దేవతలుగా కొలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొండకోనల్లో కీకారణ్యంలో నిర్వహించుకునే జాతర ఇది. ప్రపంచంలో మరెక్కడా జాతరకు కోటి మంది భక్తజనం హాజరైన దాఖలాలు లేవు. కేవలం సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రమే ఇంత గొప్ప ఆదరణ రావడానికి ప్రధానమైన కారణం భక్తుల అపారమైన నమ్మకం. జాతర జానపదల జీవన స్రవంతిలో సాంస్కృతిక విలువ.అడవిలో కొలువున్న దేవతల నెలవును చేరి, సంసార బాధల్ని మరిచి తన వారందరితో కలిసి మనసారా పండుగ జరుపుకునే మహోత్సవం. దీంట్లో యాత్ర, దైవారాధన, నివేదన, పండుగ, అన్నీ ఇమిడి ఉంటాయి.ఒక్క వరంగల్‌ ‌జిల్లాలోనే కాక యావత్‌ ‌భారత దేశంతో పాటు, విదేశీయులను కూడా ఆకర్షించే శక్తి గల జాతరగా పేరుపొందిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రముఖమైంది. ఈ జాతర తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది గిరిజనుల ఆవాసమైన అటవీ ప్రాంతం వివిధ రకాలైన జంతువులకు, వృక్ష సంపదకు, ప్రసిద్ధి పొందిన రమణీయ ప్రదేశం ఇది. జాతరలో పాల్గొనడానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలే కాకుండా, ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. పూర్వం ఈ జాతరను కోయలు మాత్రమే జరుపుకునేవారు. సమ్మక్క సారలమ్మలు కోట్లాది మందికి ఇలవేల్పులు! అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారిని భక్తజనుల కోరికల నెరవేర్చు దేవతామూర్తులుగా కొలుస్తారు.మాఘ శుద్ధ పూర్ణిమ నాడు జరిగే ఉత్సవం. భవిష్య సమ్మక్క సారలమ్మలను చెరొక సంవత్సరానికి రక్షక దేవతలుగా భావించి, వారి గౌరవార్థం ఒకేసారి ఈ జాతరలో కొలుస్తారు. కాకతీయుల కాలం నాటికి ఇదొక రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యతగల ఉత్సవం కావడం వలన కూడా ఈ భారీ ఉత్సవాన్ని రెండేళ్లకు ఒకసారి నిర్వహించే సాంప్రదాయాన్ని పాలకులు నిర్దేశించి ఉంటారు.

sammakka Saralamma Maha jatara is the largest tribal community in Asiaఈ జాతరలో పూజలందుకుంటున్న దేవతల కథ, మౌలిక పురాణం గాను, నిప్పు లేనిదే సెగ రాధా అన్నట్లుగా కొంత చారిత్రిక లింకుతో కలగలిపి ప్రచారంలో ఉంది. స్థల పురాణం ప్రకారం గోదావరి నది తీర భూములలో ఉన్న దట్టమైన అడవిలో నివసించే కోయ వారికి ఒకరోజు ఆరు పులుల మధ్యలో పచ్చిక పై నిశ్చితంగా పడుకొని నవ్వుతూ కేరింతలు కొడుతున్న ఒక పసిపాప కనిపించిందట. ఆమె చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం ఏర్పడి ఉంది. ఆ వింతను గిరిజనులు నిశ్చేష్టులై చూస్తుండగానే, చుట్టూ ఉన్న పులులు అదృశ్యమయ్యాయి. ఆ పాప చుట్టూ ఉన్న కాంతి వలయం కూడా మాయమైంది. సమ్మక్క సారలమ్మ పుట్టుక కాలం కచ్చితంగా నిర్దేశించబడిన దాఖలాలు లేవు. కానీ వారి జననం, మరణం వాస్తవాలే. చరిత్రకందని సత్యాలుగా ఈ వీరవనితల కథలు ప్రచారంలోనికి వచ్చినాయి. ప్రజాదరణ పొందింది కోయ తెగ వారిలో ప్రాచుర్యం పొందాయి. సమ్మక్క నాగులమ్మ సారలమ్మ పగిడిద్దరాజు ప్రతాపరుద్రుడు, జంపన్న గోవింద రాజులు కాక వారి గురించి కథలో మేడరాజు, కాకతీయ ప్రతాపరుద్రుడు మంత్రి యుగంధరుడు, జంపన్న వాగు దెయ్యాల వాగు, మేడారం, బయ్యక్కపేట, చంద్ర పురం, చందాలకు వలసపోయిన కోయల విశిష్ట మహా రుషి సంతానం, అరవ గోత్రం బేరం బోయిన రాజు, ఆయన కుమార్తె, చిలుక దేవేంద్రుని వరంగా విశ్వామిత్రుని ద్వారా గర్భందాల్చిన రాయ బండ ని రాజు జననం, శశి మందాకిని జననం, కార్తీక మహారాజు కుమార్తె చంద బోయి రాలు, కనకం బోయ రాలు, వివాహం, వారి అడవిలో తిరుగుతూ ఉండగా కందమూలాలు తవ్వగా భూమి నుండి ఒక పెట్టె లభించడం ఆ పెట్టెలో ప్రాణంతో ఉన్న శిశువు సమ్మక్క గా కోయ జాతి మహిళగా, దైవాంశ సంభూతురాలిగా, మంత్ర మహోత్సవ సర్వ శక్తులు కలిగినదిగా పేరు పొందడం చెప్పబడే కథలో ఒకటిగా చెప్పబడుతోంది. ఆమె బాల్యం నుండి విలువిద్యను, కత్తి సాము వైద్య ప్రక్రియల్ని అభ్యాసం చేసింది. రోగాల నుండి రక్షణ కల్పించి ప్రజలకు మీరు ఆరాధనీయురాలు అయింది.

యుక్త వయసు రాగానే పగిడిద్దరాజు అనే కోయరాజు కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ మన ఇద్దరు కుమార్తెలు, జంపన్న రాజు అనే కుమారుడు జన్మించాడు. పగిడిద్దరాజు ఒక సామంత ప్రభువు. ఒకసారి భయంకరమైన కరువు వచ్చి కప్పం కట్టక పోవడం వల్ల కాకతీయ మహారాజు సైన్యం అతనిపై దాడి చేసింది. యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందాడు. ఆయన కుమారుడు కూతుళ్లు నాయకత్వంలో కోయిల సైన్యం కదిలింది. సారలమ్మ నాగులమ్మ లు కూడా, వీర మరణం పొందారు. జంపన్న ఓడిపోయి ఆ అవమానాన్ని భరించలేక కత్తితో పొడుచుకొని వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటినుండి ఆ వాగును ‘‘జంపన్న ’’ వాగుగా పిలుస్తున్నారు. యుద్ధంలో ఓడిపోయిన కోయరాజు సైన్యం సమ్మక్క దగ్గరకు వచ్చి ఆమెకున్న మహిమలతో మరణించిన గిరిజనులను బ్రతికించమని వేడుకున్నారు. ఆమె దానికి ఒప్పుకోలేదు.  చనిపోయిన జీవి తిరిగి మళ్లీ బ్రతకడం ప్రకృతి విరుద్ధం అందుకే వారి కి మనో ధైర్యం కలిగించడానికి సమ్మక్క స్వయంగా యుద్ధానికి బయలు దేరింది. ఈ యుద్ధంలో ఆమె కూడా తీవ్రంగా గాయపడి గుర్రంపై చిలుకలగుట్ట వైపు వేగంగా కదిలి పోయింది గిరిజనులు (కోయలు) ఆమెను అనుసరించారు కొంత దూరం వెళ్ళాక ఆమె అదృశ్యం అయింది. ఆమె అదృశ్యం అయిన చోట ‘‘నెమలి నార వృక్షం’’ క్రింద పుట్ట మీద కుంకుమ భరణి కనిపించింది. దానిని తెరిచి చూస్తే పసుపు కుంకుమ కొన్ని మూలికలు ఉన్నాయి. పిల్లలు వాటిని సమ్మక్క ప్రసాదంగా స్వీకరించారు అప్పటినుంచి సమ్మక్క సారలమ్మలు దేవతలుగా కోయ ప్రజలచే పూజలు అందుకున్నారు. చంద్రవంశపు కోయలు సరి మల్ల, బక్కయ్య పేట చందా వైపు గ్రామాలలో స్థిరపడ్డారు.1944 – 50 లో సారలమ్మ జాతరలు చందా పరయ్య వారిచే నిర్వహించబడింది. ఈ జాతరకు భక్తులే కాకుండా, వేడుకలు చూడడానికి వచ్చే అశేష జనం సంఖ్య 1970-80 దశకంలో వేల సంఖ్యలో ఉండేది, 2000 సంవత్సరంలో 40 లక్షలు 2002 – 2004 సంవత్సరాలలో 50 లక్షలు, 2006 సంవత్సరంలో సుమారు కోటి మంది భక్తులు పాల్గొన్నారు.

ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1995లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ జాతర గద్దెల వద్ద సాంప్రదాయ దేవీ దేవతల ప్రతిమల నిలుపుట ఏ కాక అటవిక సమాజం సంస్కృతి, వేషభాషల ను కూడా ప్రదర్శించే విగ్రహ రూపాలతో పాటు ప్రకృతిలోని పక్షి జంతు పరిసర అలంకరణ చేసిన అగం తకులు వన విజ్ఞానం పొందుటకు అవకాశం ఉంది. ఇప్పుడు ప్రదర్శించిన చిత్రములలో సాంప్రదాయ దేవతా రూపాలు గోభక్తిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. అమ్మవార్ల జాతరలో పాల్గొని ఆశీస్సులు పొందామని తమకు సంవత్సరాల వరకు రక్షణ దొరుకుతుందని ప్రగాఢ విశ్వాసంతో ప్రజలు ఇళ్లకు మళ్లుతారు.జాతర బహుశా ప్రపంచంలోనే గొప్ప జాతరగా చెప్పవచ్చు.

Leave a Reply