“దేశవ్యాప్తంగానున్న విశ్వవి ద్యాలయాలల్లో ఖాళీగానున్న ఆచార్య , సహాచార్య కొలువులభర్తీ ప్రక్రియను మొదలుపెట్టి వీలైనంతత్వరగా పూర్తి చేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కోరి సంవత్సరాలు గడిచిపోయినా, కోరిక మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే, కొత్త రాష్ట్రం సిద్ధించాక ఇప్పటివరకు వారి నియామకానికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తిస్థాయిలో నోచుకోలేని పరిస్థితి.”
దేశవ్యాప్తంగానున్న విశ్వవి ద్యాలయాలల్లో ఖాళీగానున్న ఆచార్య , సహాచార్య కొలువులభర్తీ ప్రక్రియను మొదలుపెట్టి వీలైనంతత్వరగా పూర్తి చేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ కోరి సంవత్సరాలు గడిచిపోయినా, కోరిక మాత్రం ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉండిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే, కొత్త రాష్ట్రం సిద్ధించాక ఇప్పటివరకు వారి నియామకానికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తిస్థాయిలో నోచుకోలేని పరిస్థితి. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ అదృష్టాన్ని కూడా నోచుకోలేదు. మరికొన్ని పోస్టులకు రోస్టర్ వ్యవస్థ పూర్తిచేయక ఆగిపోయాయి. కొత్తజోన్లు, వాటి పరిధిలోని కొలువులపై స్పష్టత రాకపోవడం మరొక ఇబ్బంది. వీటికి అదనంగా, కోర్టుచిక్కులు, పరీక్ష నిర్వహణలో మార్పులు, కేంద్రం అనుమతులకు వేచిచూడటం ఇలా ఎన్నోరకాల కారణాలవల్ల కొలువులభర్తీ జరగటంలేదు.
కొలువులొస్తాయన్న కోటి ఆశలతో విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే వారి ఆశ ఆరేళ్ళుగా నిరాశగా మిగిలింది. ఎన్ని ఆందోళనలు చేసినా, ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతులు పొందినా నిరుద్యోగులపాలిట శాపంగానే మిగిలి పోయింది. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, జె.ఎన్.టి.యు. హెచ్, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటి, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్ , శాతవాహన యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ…. రాష్ట్రవ్యాప్తంగా 24 కేంద్ర రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేటు విశ్వ విద్యాలయాల నియంత్రణ లో దాదాపు 1500 కళాశాలలు విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్నా కొలువుల భర్తీ శూన్యమే.
ఈ కొలువులు పొందాలంటే డాక్టర్ అఫ్ ఫిలాసఫీ పూర్తిచేయాలి లేదా నెట్,సెట్, జేఆర్ ఎఫ్ క్వాలిఫై కావాలి. •ఈ అర్హతలు సాదించాలంటే 30 నుండి 40 సంవత్సరాల వయసు పడుతుంది. ఈ తరహా పోస్టులను గతంలో భర్తీచేసి దశాబ్దకాలం గడిచినా ఆ తర్వాత ఆ అదృష్టం నోచుకోలేదు. ఉమ్మడిఆంధ్ర ప్రదేశ్ లో కొలువుల భర్తీచేస్తే తెలంగాణ ప్రాంతంవారికీ అన్యాయం జరుగుతుందని భావించి, ప్రతివిద్యార్థి ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ ఆవిర్భావానికి త్యాగాలుచేసారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత పాతలెక్కల ప్రకారంపరిశీలిస్తే 99 ప్రొఫెసర్లు ,270 అసోసియేట్ ప్రొఫెసర్స్, 692 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం 1061 ఖాళీలున్నాయని తేలింది. ఆ ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. ఎన్నో కారణాలు. ముందుగా కొంతకాలం యూనివర్సిటీలకు శాశ్విత వైస్ ఛాన్సలర్ లేక రోస్టర్ సిస్టమ్ చేయడానికి కుదరలేదు. ఆ తర్వాత కొంతకాలానికి అన్నీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించి, యూనివర్సిటీలు సక్రమంగా నడవడానికి కృషిచేసి, రోస్టర్ విధానం పూర్తిచేసినా సాంకేతికపరమైన కారణాలతో ఖాళీలభర్తీ నోచుకోలేదు. చూస్తుండగానే రెండు సంవత్సరాల పదవీకాలం ముగిసి మళ్ళీ ఇన్ చార్జ్ ఐఏఎస్ లతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఉపకులపతులతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను నియమించకపోవడం వలన సకాలంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రాంట్స్ , ప్రభుత్వ నిధులు, విద్యార్థుల ఫెలోషిప్ లు, ఇతర నిధులు పొందడంలో ఆలస్యమై విశ్వవిద్యాలయ పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా మారి విద్యార్థులు తీవ్రఇబ్బందుల పాలవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపకులపతుల నియామకం చేపడుతుందా ? ఆ తర్వాతైనా కొలువులు భర్తీచేసి విద్యార్థులకు న్యాయం చేస్తుందా లేక ఇలాగే ఏళ్ళ తరబడి కాలం గడుపుతుందా.. అని స్పష్టత కనబడక అత్యున్నత చదువులు చదివి నిరుద్యోగులుగా నిరాశతో ఉన్నారు. స్వాతంత్య్రానికి నాలుగు దశాబ్దాల ముందే, 1911లో దాదాభాయి నౌరోజీ తన అనుచరులతో కలసి బ్రిటిష్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళి, మీరు ఎన్నేళ్లయినా పాలించండి కానీ దేశంలో ఉచిత నిర్బంద విద్యను అమలుచేయాలని కోరారు. స్వాతంత్య్రం సాధించిన తర్వాత 2009 లో కేంధ్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఉచిత నిర్బంధవిద్యకు చట్టం చేసి అమలు పరుస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రం నుంచి 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణలో మిగులుబడ్జెట్, ఆంధ్ర అప్పుల ఊబిలో ఉంది. ఈ 7 సంవత్సరాలలో తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రలో కూడా ఎన్నో అభివృద్ధికార్యక్రమాలు, నూతనపథకాలు, సరికొత్త ఒరవడికి నాందిపలుకుతూ, నిరుద్యోగ సమస్య అధిగమించే కృషిజరుగుతోంది. పాలిట వరంలా నిలుస్తూ ,కష్టకాలం నుండి గట్టెక్కుతూ పలురాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నపుడు మనరాష్ట్రంలో పరిస్థితికి చింతించక తప్పడడంలేదు.

9441930361