Take a fresh look at your lifestyle.

అమ్మ భాష కు వందనం

“పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం బంగ్లాదేశ్‌ (‌తూర్పు పాకిస్తాన్‌) ‌ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాష ను అధికారిక భాష గా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్‌ ‌ప్రజలు తమ మాతృభాష అయిన బెంగాలీ ని కాపాడుకోవడానికి భాషా ఉద్యమాన్ని 1952 ఫిబ్రవరి 21 న ఢాకా లో ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం నిరసన కారులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో బంగ్లాదేశీ యువకులు సలామ్‌, ‌భర్కత్‌, ‌రఫిక్‌, ‌జబ్బర్‌ ‌మరియు షఫర్‌ ‌లు అనే ఐదుగురు యువకులు మరణించారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన నే నేటి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారి తీసింది. నాడు పాక్‌ ‌ప్రభుత్వం చేసిన మారణకాండ లో మాతృభాష కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గా ‘‘షాహీద్‌ ‌మినార్‌’’ ‌నిర్మించుకొని 1955 నుంచి ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌ ‌లో మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుని అక్కడి ప్రజలు అమరవీరులను స్మరించుకుంటారు.”

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 వ తేదీ ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని భాషా సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విషయాల సంస్థ (యునెస్కో) ఈ రోజుని తొలిసారి 1999 లో నవంబర్‌ ‌లో ప్రకటించింది.యుఎన్‌ఓ ‌కూడా దీనిని ధృవీకరించి 2008 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాష సంవత్సరం గా ప్రకటించింది. మాతృభాష అనగా ‘‘ఏ భాషను అయితే శిశువు అసంకల్పితంగా మాట్లాడుతాడో, ఏ భాష ఇతర భాష ల అభ్యసనం పై ప్రభావం చూపుతుందో ఆ భాష నే మాతృభాష’’ అంటారు. రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌ప్రకారం మాతృభాష అనగా ‘‘అమ్మ పాలంతా మాధురమైంది, పవిత్రమైనది. కాబట్టి ప్రతి మనిషి మాతృభాష ను తప్పకుండా నేర్చుకోవాలి’’. ఈ నిర్వచనాలు బట్టి మాతృభాష కు మన నిత్యజీవితం లో ఎంతటి ప్రాముఖ్యత ఉందో మనం అర్తం చేసుకోవచ్చు.

ప్రపంచ చరిత్రలో మాతృ భాష పరిరక్షణకు ఎంతోమంది ప్రాణాలర్పించారు. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అలాంటి వాటిలో ప్రముఖమైనది ‘‘బెంగాలీ భాషా ఉద్యమం’’. నేటి బంగ్లాదేశ్‌(‌నాటి తూర్పు పాకిస్తాన్‌)‌లోని ఢాకా లో 1952 ఫిబ్రవరి 21 రోజు బెంగాలి భాషా ఉద్యమం జరిగింది…ఒకప్పుడు బంగ్లాదేశ్‌ ‌పాకిస్థాన్‌ ‌లో భాగంగా ఉండేది. పాకిస్తాన్‌ ‌దేశపు అధికారిక భాష ఉర్దూ..బంగ్లాదేశ్‌ ‌లో మెజారిటీ ప్రజలు ముస్లిం మతస్తులైనా వారి మాతృ భాష మాత్రం బెంగాలీ నే. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం బంగ్లాదేశ్‌ (‌తూర్పు పాకిస్తాన్‌) ‌ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాష ను అధికారిక భాష గా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్‌ ‌ప్రజలు తమ మాతృభాష అయిన బెంగాలీ ని కాపాడుకోవడానికి భాషా ఉద్యమాన్ని 1952 ఫిబ్రవరి 21 న ఢాకా లో ప్రారంభించారు. ఉద్యమాన్ని అణచివేయాలని పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం నిరసన కారులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో బంగ్లాదేశీ యువకులు సలామ్‌, ‌భర్కత్‌, ‌రఫిక్‌, ‌జబ్బర్‌ ‌మరియు షఫర్‌ ‌లు అనే ఐదుగురు యువకులు మరణించారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన నే నేటి బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దారి తీసింది. నాడు పాక్‌ ‌ప్రభుత్వం చేసిన మారణకాండ లో మాతృభాష కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గా ‘‘షాహీద్‌ ‌మినార్‌’’ ‌నిర్మించుకొని 1955 నుంచి ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌ ‌లో మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుని అక్కడి ప్రజలు అమరవీరులను స్మరించుకుంటారు.

అలాగే యుఎస్‌ఎస్‌ఆర్‌(‌యూనియన్‌ ఆఫ్‌ ‌సోవియట్‌ ‌సోషలిస్ట్ అం‌డ్‌ ‌రిపబ్లిక్‌) ‌ప్రపంచంలో నే ఒక్కప్పుడు పెద్దది మరియు బలమైన దేశం. నాటి సోవియట్‌ ‌పాలకులు మిగిలిన ప్రాంతాలపై రష్యన్‌ ‌భాష ను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. మిగిలిన ప్రాంత పౌరులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇలా 1991 వ సంవత్సరం లో యుఎస్‌ఎస్‌ఆర్‌ ‌విచ్చిన్నం కావడానికి అనేక కారణాలలో రష్యన్‌ ‌భాష ఆధిపత్యం వహించడం కూడా ఒకటి. మన దేశంలో కూడా ఇలాంటి భాషా సాంస్కృతిక వైరుధ్యాల వల్ల ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని మనం చూడవచ్చు.1963 సంవత్సరం లో అధికార భాష చట్టాన్ని ఆమోదించినప్పుడు హింది ని మిగతా దేశం మీద రుద్దాడానికి ఎత్తుగడ గా భావించి తమిళనాడు లోని డి ఎం కె పార్టీ రాష్ట్ర వ్యాపితంగా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ధర్నాలు నిర్వహించి దిష్టిబొమ్మ లను , హిందీ పుస్తకాలను తగలబెట్టారు. చివరకు సైన్‌ ‌బోర్డులలో హిందీ లో ఉన్న అక్షరాల మీద నలుపు రంగు పూశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ యే హిందీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి, దేశ ఐక్యతకు భంగం కలిగే వాతావరణం ఏర్పడింది.

చివరికి పరిస్థితులు చేజారిపోతున్నట్లు భావించిన అప్పటి ప్రధానమంత్రి లాల్‌ ‌బహద్దూర్‌ ‌శాస్త్రి అధికార భాష చట్టంలో అందరూ ఆమోదించేలా కొన్ని మినహాయింపు లతో మార్పులు చేసిన తరువాత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పూలదండ లోని దారం లాగా దేశ ఐక్యత కు భాషా సాంస్కృతి లు ఎంతగా ఉపయోగపడతాయో మన రాజ్యాంగ నిర్మాతలు ముందే గుర్తించి అధిక జనాభా మాట్లాడే 22 భాషలకు రాజ్యాంగ హోదా కల్పించి మాతృభాషలను కాపాడుతున్నారు. ఇటీవల 2015 వ సంవత్సరం అక్టోబర్‌ 31 ‌వ తేదీన సర్ధార్‌ ‌వల్లబాయ్‌ ‌పటేల్‌ 140 ‌వ జయంతి సందర్భంగా ‘‘ఏక్‌ ‌భారత్‌ ‌శ్రేష్ట్ ‌భారత్‌’’అనే కార్యక్రమాన్ని కేందప్రభుత్వం ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం జాతి ఐక్యతను దేశ సమగ్రతను పెంపొందించడం. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి సంభవించిందిన భాష ను పరస్పరం నేర్చుకోవడం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ని విద్యార్థులు హర్యానా రాష్ట్ర భాష ను, హర్యానా రాష్ట్ర విద్యార్థులు తెలుగు భాష ను నేర్చుకుంటున్నారు .భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక . ఇందులో భాష అనేది జాతి ఐక్యతను కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకే అనే సామెత ఎంత వాస్తవమో..ఎంతటి వారికైన మాతృభాష మాతృ భాషనే. మాతృ భాషకు ప్రత్యామ్నాయం చూపాలనుకోవడం తల్లి స్థానానికి ప్రత్యామ్నాయం చూపాలనుకోవడమే. ప్రపంచ దేశాల ప్రజలకు మాతృభాష గొప్పతనం గురించి బహుభాషాలు, సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు యునెస్కో ఫిబ్రవరి 21 ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గా గుర్తించి ప్రతి ఏడాది జరుపుకుంటున్నారు.

ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచంలో ని సగం మాతృ భాషలు తమ ఉనికి ని కోల్పోయాయట. భాషాశాస్త్రవేత్తల ప్రకారం గత మూడు వందల సంవత్సరాల కాలంలో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియా లొనే అనేక తెగల మాతృభాషలు అంతరించిపోయాయట. ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా నే యునెస్కో మాతృభాష ల పరిరక్షణ అన్నది ‘‘జాతీయ పౌర రాజకీయ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం’’అని నిర్ధారించింది.

మనిషి జీవితంలో సహజంగా మొదట గా నేర్చుకునే భాష మాతృభాష. ఇది మనకు సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. మాతృభాష లో విద్యాబోధన వల్ల పిల్లలకు మానసిక వత్తిడి ఉండదని మానసిక నిపుణులు సైతం పదే పదే చెప్తూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ప్రపంచం తో అనుసంధానం కోసం ఇంగ్లీష్‌ ‌భాష నేర్చుకోవడం తప్పని సరి అయిన నేటి కాలంలో మాతృభాష ని కూడా కాపాడుకోవడం పౌరుల ప్రథమ కర్తవ్యం కావాలి.

siva shankar mattam
శివ శంకర్‌ ‌మఠం
సోషల్‌ ‌స్టడీస్‌ ‌టీచర్‌
9440621572

Leave a Reply