నా దేహం ముక్కలైనా కానీ..
నా దేశంలోకి శత్రువును రానివ్వననే
కీర్తి కిరీటాలకందని జవాన్ ఆశయం గొప్పది
ప్రాణాలు గాలిలో కల్వనీ..
వినీలాకాశాన నా జాతీయ జెండా
స్వేచ్ఛగా ఎగరాల్సిందేననే
జవాన్ ఎల్లలు లేని త్యాగానికి ఏమివ్వగలం?
జెండా మూడు రంగుల గుడ్డ కాదు
నూట ముప్ఫై కోట్ల భారతీయుల ఆత్మగౌరవ వస్త్రం
అదే మా జాతికి పవిత్రం
శాంతిని కోరే భారతజాతి కంఠ శోషను
అమర జవాన్ల ఆత్మ ఘోషను
మర ఫిరంగులుగా మలిచి
శత్రు మూకలను తరుముతామనే మడమ తిప్పనిమన జవాన్ల ఆవశ్యకత అనివార్యం..
పాలకుల ఒప్పందాలు లక్ష్మణ రేఖలు దాటుతున్నా..
అగ్రవాద చైనా తొండాటేంది?
పాకిస్తాన్ ఉగ్రవాద పైశాచికమేంది??
భారత సరిహద్దులో చల్లని మంచుకొండల్లో
అశాంతి మంటలు లేపుడేంది?
తలవంచని వీరజవానుల అమరత్వంలోంచి
పాలకుల ‘‘దేశభక్తి’’ తత్వమేందో తెల్వాలి
అగ్ర, ఉగ్ర వాదులు
మన సరిహద్దుల దరిదాపుల్లోకి రాకుండా
కంటికి రెప్పలా.. రేయింబవళ్లు కాపలా కాసే జవాన్ల ‘‘దేశభక్తి’’ లోంచి వచ్చే
స్వేచ్చా వాయువు పీల్చుచూ
శాంతి కపోతాలు స్వేచ్ఛగా ఎగరాలి
తల్లి భారతి మొహం పై
చిరునవ్వులు పూయాలి
వరంగల్, 9573666650.