ఏపీ సీఎం జగన్కు ఆయన సోదరి షర్మిలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు షర్మిల ప్రకటించడంపై ఆయన స్పందించారు. తెలంగాణలో వైసీపీలాంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండొచ్చని అన్నారు. ఇరురాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనే జగన్ వైసీపీని విస్తరించలేదని ఆయన పేర్కొన్నారు.
వైసీపీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని వెల్లడించారు. షర్మిలను పార్టీ పెట్టొద్దని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశామని తెలిపారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని, రాజకీయాలపై ఆమెకు అనుభవం ఉందని సజ్జల పేర్కొన్నారు. ’షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి. 2,3 నెలలుగా ఆమె పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారు.
షర్మిల నిర్ణయం జగన్ను కాస్త బాధకు గురిచేసి ఉంటుంది. ఒకట్రెండు పదవుల కోసం జగన్తో షర్మిల విభేదించలేదు. షర్మిలకు పదవి ఇవ్వడం జగన్కు పెద్ద కష్టం కాదు. పార్టీని కుటుంబపరం చేయొద్దనే జగన్ భావించారని సజ్జల పేర్కొన్నారు. షర్మిలకు జగన్ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన అన్నారు.తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. మంగళవారం వి•డియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ పెట్టొద్దని షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. షర్మిల తమ ఆత్మీయ సోదరని, గత మూడు నెలలుగా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్, షర్మిల మధ్య వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తెలంగాణలో సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని, పార్టీ నిర్ణయం, ఫలితాలను షర్మిలే చూసుకుంటారన్నారు.