Take a fresh look at your lifestyle.

సాహితీశరథి దాశరథి !

ప్రజా ఉద్యమ వారధి
సాహిత్య రథ సారథి
అతడే…!
దాశరథి కృష్ణమాచార్యులు

తెలంగాణ దాస్య విముక్తికి
కలం పోరు సాగించిన వీరుడు

నిజాం నిరంకుశ పాలనపై.
అక్షర గళం విప్పిన విప్లవుడు

రజాకారుల గుండెల్లో
కవన ఖడ్గం దింపిన ధీరుడు

రాజరికపు అరాచకాలపై
పద్య ఫిరంగి పేల్చిన శూరుడు

జమీందారుల దాష్టికాలపై
అగ్నిధార కురిపించిన రౌద్రుడు

సంష్ఠాన ఆధిపత్యంపై
రుద్రవీణ మోగించిన విక్రముడు

దొరల గడీల బురుజు మీద
రగల్‌ ‌జెండా ఎగరేసిన శౌర్యుడు

గాలీబు గజళ్ళు, షాయరీలతో
హృదులు గెలిచిన సాహితి రేడు

తెలంగాణ కోటిరత్నాల వీణంటూ
ఎలుగెత్తి చాటిన మహా యోధుడు

తరాల బూజు నిజాం రాజంటూ
నిక్కచ్చిగ నినదించిన కవి ధీరుడు

అభ్యుదయ కవితా జలది
స్వతంత్ర సారధి దాశరథి
తెలంగాణ చరిత్ర పుటల్లో…
స్ఫూర్తి చిహ్నమై ప్రకాశిస్తాడు

తూరుపు కొండల్లో…
కవన సూరీడై ప్రజ్వలిస్తాడు

(జులై 22 న దాశరథి జయంతి సందర్బంగా అక్షర ప్రణతి అర్పిస్తూ….)
– కోడిగూటి తిరుపతి :9573929493

Leave a Reply