Take a fresh look at your lifestyle.

సాహితీ భీష్ముడు కపిలవాయి…

పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత సాహితీ పరిశోధకుడు కవి కేసరి బిరుదాంకితులు నడిచే విజ్ఞానసర్వస్వం సాహితీ భీష్ముడిగా పద్య రచన తో ఆయన ప్రస్థానం ప్రారంభమైన కథారచన విమర్శ పక్రియతో వెలుగులోకి వచ్చిన కవి జానపద సాహిత్యం పాలమూరు జిల్లాలో దేవాలయాలు పై విస్తృత పరిశోధనలు చేసిన కవి సుమారు 70 కి పైగా పుస్తకాలను రచించిన వ్యక్తిగా కవి కేసరి అనే బిరుదు అందుకున్న కవిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ను అందుకున్న తొలి వ్యక్తిగా పేరొందిన మహోన్నత వ్యక్తి కపిలవాయి లింగమూర్తి. కపిలవాయి లింగమూర్తి పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూర్‌ ‌మండలం జీను కుంటలో మాణిక్యమ్మ వెంకటాచలం దంపతులకు 19 28 మార్చి 31న ప్రభవ నామ సంవత్సరం మాఘశుద్ధ  నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండేళ్ళ వయసులోనే తండ్రి చనిపోవడంతో మేనమామ లక్ష్మయ్య దగ్గర పెరిగాడు లింగమూర్తిగారు.
పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశారు. ఆంధ్ర సారస్వత పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని సంపాదించాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు పట్టా పొంది 1954 సంవత్సరంలో నాగర్‌ ‌కర్నూల్‌ ‌లో జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు. ఆ తర్వాత 1972 సంవత్సరంలో పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరి దశాబ్దాల కాలం పాటు సేవలందించారు. 1983 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వం గా పేరు పొందారు. పలు గ్రంథాలు రచించి పలు పరిశోధనలు చేసి సాహితీవేత్తగా పేరు పొందడం జరిగింది. కపిలవాయి కి తెలుగు విశ్వవిద్యాలయం 2014 ఆగస్టు 26న గౌరవ డాక్టరేట్‌ ‌ను ప్రకటించింది. 2014 ఆగస్టు 30 రోజున తెలుగు విశ్వవిద్యాలయం పదమూడవ స్నాతకోత్సవం లో రాష్ట్ర గవర్నర్‌ ‌నరసింహం గారు కపిలవాయి లింగమూర్తి గారికి గౌరవ డాక్టరేట్‌ ‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తొలి గౌరవ డాక్టరేట్‌ ‌పొందిన వ్యక్తిగా కపిలవాయి కి ఆ గణత దక్కింది.
1954 నుంచి 1983 సంవత్సరం పదవి విరమణ పొందే వరకు నాగర్కర్నూల్‌ ‌జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసి ఇ అక్కడే స్థిరపడ్డాడు కపిలవాయి లింగమూర్తి గారు. అనేక స్థల చరిత్రలు దేవాలయ కథలకు ఆయన ప్రాణం పోసిన వ్యక్తిగా పేరొందాడు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కవులకు సాహితీవేత్తలకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలో జీవోలు తెలుగులో రావాలి ప్రభుత్వ పాఠశాలలో తెలుగులో బోధించాలి అన్న కవి రచయిత కపిలవాయి లింగమూర్తి గారే. కపిలవాయి లింగమూర్తి గారు శతాధిక రచనలు చేయడం జరిగింది. 1992 సంవత్సరంలో కవితా కళానిధి పరిశోధన పంచనన, 19 95 సంవత్సరంలో కవి కేసరి, 2005 సంవత్సరంలో వేదాంత విశారద, 2010 సంవత్సరంలో గురు శిరోమణి, 2012 సంవత్సరంలో సాహిత్య కేసరి అనే బిరుదు పొందాడు.
సాహిత్య రంగంలో కపిలవాయి లింగమూర్తి చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాల్లో సన్మానాలు జరిగాయి. 1983 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వీరిని సన్మానించారు ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు వైయస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వారిచే సన్మానం పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సన్మానించారు. నలుగురు ముఖ్యమంత్రులచే సన్మానించిన బడిన ఏకైక తెలుగు కవి పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం బూర్గుల  రామకృష్ణ ప్రతిభా పురస్కారం బ్రౌన్‌ ‌సాహిత్య పురస్కారం నోరి నరసింహశాస్త్రి పురస్కారం కందుకూరి రుద్రకవి పురస్కారం పులికంటి సాహిత్య పురస్కారం బి.ఎన్‌.‌శాస్త్రి పురస్కారం మొదలైన సత్కారాలను పొందారు. 2018 నవంబర్‌ 6 ‌న కపిలవాయి లింగమూర్తి కొన్నాళ్లు శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడుతూ హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్‌ ‌హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జానపద సాహిత్యం పాలమూరు జిల్లాలో దేవాలయాల చరిత్రలపై ఆయన చేసిన విస్తృత పరిశోధనలు కపిలవాయి కి తెలుగు రాష్ట్రంలో విశేష గుర్తింపు తెచ్చిపెట్టాయి.
naresh
నరేష్‌ ‌జాటోత్‌. ఎంఏ. ‌బీఈడీ. కాకతీయ విశ్వవిద్యాలయం.
(8247887267)

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply