Take a fresh look at your lifestyle.

ముగిసిన సహకార ఎన్నికల పోలింగ్‌

అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు

  ‌తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల కౌంటింగ్‌ ‌ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటలనకు తావు లేకుండా ఎన్నికలు ముగిసాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్‌ ‌మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్‌ ‌ప్రారంభం అయ్యింది. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలో 747 పిఎసిఎస్‌ ‌ల పరిధిలోని 6,248 డైరెక్టర్‌ ‌పోస్టులకు ఎన్నికలు జరుగుతుండగా?. ఇప్పటికే 157 సొసైటీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఎన్నికల్లో సూమారు 12 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు అవసరమైన అన్ని చోట్ల అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల తర్వాత పాలకవర్గాల నియామకం చేపట్టనున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారి సుమిత్ర తెలిపారు. ఈ ఎన్నికలకు సర్కార్‌ ‌పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పిలు భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

బీరోలు సంఘంలో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బీరోలు సహకార సంఘాల ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌లోని ఇరు వర్గాల మధ్య గొడవతో టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. పోలింగ్‌ ‌కేంద్రంలోకి ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వెళ్లడంతో గొడవ మొదలైంది. ఇందుకు నిరసనగా పోలింగ్‌ ‌కేంద్రం ఎదుట మరో వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్‌ ‌కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ ‌నేత నరేష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

రైతుపై చేయిచేసుకున్న పోలీస్‌
‌నల్గొండ జిల్లా హాలియా మండలం కొత్తపల్లిలో రైతుపై ఎస్సై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొత్తపల్లి సహకార సంఘం ఎన్నికల్లో ఓటువేసేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో కొంత మంది ఓట్లర్లు ఒక్కసారిగా లోనికి దూసుకువచ్చేందుకు యత్నించారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ఎస్సై వీరరాఘవులు యత్నిస్తుండగా ఎస్సై… రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సై వీరరాఘవులు ఓ రైతుపై చేయి చేసుకున్నాడు. రైతు చెంపపై పదే పదే కొట్టాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు పోలింగ్‌ ‌కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఎస్సై వీరరాఘవులుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ ‌చేశారు.

కామారెడ్డిలో ఓటర్ల ఆందోళన
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలోని 10వ పోలింగ్‌ ‌కేంద్రంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితాలో పేరు ఒకరిది ఫోటో ఒకటి రావడంతో ఇబ్బంది నెలకొంది. నిట్టు లక్ష్మణ్‌రావుకు చెందిన ఓటును పెద్దబోయిన లక్ష్మణ్‌రావు అనే వ్యక్తి వేయడం గొడవకు దారి తీసింది. తన ఓటు ఎలా వేస్తారంటూ నిట్టు లక్ష్మణ్‌రావు పోలింగ్‌ ‌కేంద్రంలో ఆందోళనకు దిగారు. అయితే ఏజెంట్లు ఒప్పుకోవడంతో ఓటు వేయించామని సిబ్బంది చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply