Take a fresh look at your lifestyle.

సంక్షోభంలో సాగర్‌ ‌కుడికాల్వ ఆయకట్టు

తెలంగాణ తీరుతో నీట సంక్షోభం తప్పదేమో – ఆయకట్టు రైతుల ఆందోళన
గుంటూరు,జూలై 8 : ప్రస్తుత జల వివాదాలతో ఉన్న నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌కు తోడేస్తున్న క్రమంలో సాగర్‌ ‌కుడికాలువ ఆయకట్టు ప్రమాదం పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్ననీటిని విద్యుత్‌ ‌కోసం తోడేయడంతో నీరు వృధాగా సముద్రంలోకి వదలాల్సి వస్తోంది. దీంతో కుడి కాలువ ఆయకుట్టులో పంటల సాగునే సంక్షోభంలోకి నెట్టివేస్తోంది. మొత్తం ద వరద రాకుంటే సాగర్‌ ఆయకట్టులో పంటల సాగును ఈ ఏడాది రైతులు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో ముందుకు సాగాలని సూచిస్తు న్నారు. సాగర్‌ ‌నుంచి నీటిని వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం మొకాలడ్డుతున్నది. మరో వైపు రాయలసీయ ప్రాంతానికి శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథాన్యం ఇస్తున్నది. అయితే సాగర్‌ ‌రైతుల ప్రయోజనాల గురించి ఆలకించే వారే లేకుండాపోయారన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. కుడి కాలువకు ఉన్న నికర జలాల హక్కును పాలకులు హరించి వేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాల ఆయకుట్టు ఉంది. అయినా ఈ రైతుల గురించి ఆలోచించకుండా తెలంగాణ ప్రభుత్వం సాగర్‌ ‌నుంచి రోజు ఐదు టీఎంసీలకు పైగా నీటిని విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగిస్తూ వృథా చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో గోదావరి జలాల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాథాన్యం ఇవ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇందుకోసం ఇరు జిల్లాలలోని ప్రజాప్రతినిధులు కృషి చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. పట్టిసీమ పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు సరఫరా చేస్తుండటంతో ఆ ప్రాంతంలో రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇదే తరహాలో నాగార్జున సాగర్‌ ‌కుడి కాలువ ఆయకట్టులో సాగు నీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారంగా గత ప్రభుత్వం భావించింది. గోదావరి పెన్నా నదుల అను సందానం పథకం తొలిదశలో గోదావరి జలాలను కుడి కాలువకు తరలించేందుకు గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని రూపొందిం చింది. ఈ పథకాన్ని చేపట్టేందుకు గత ప్రభుత్వం నకరికల్లు వద్ద శంకుస్థాపన చేసింది.

ఈ పథకంతో ఇరు జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు సరఫరా చేయవచ్చు. ఈ నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువున వైకుంఠపురం నుంచి సాగర్‌ ‌కుడి కాలువకు తరలించాలని నిర్ణయించారు. ఈ ఎత్తి పోతల పథకం పూర్తి చేయటం ద్వారా ఏడు వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు తరలించాలని ప్రణాళిక రూపొందించారు. అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, బెల్లం కొండ, రాజుపాలెం మండలాల దగా నకరికల్లు మండలం లోని సాగర్‌ ‌కుడి ప్రధాన కాలువలో నీటిని కలిపేలా డిజైన్‌ ‌చేశారు. ఈ పథకం పూర్తయితే సాగర్‌ ఆయకట్టు సాగునీటి సంక్షోభం పరిష్కారమవు తుందని, ప్రతి ఏటా వరి సాగయ్యే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో అన్న సందేహాలు ఆయకట్టు రైతుల్లో నెలకొంటున్నాయి.

Leave a Reply