Take a fresh look at your lifestyle.

భూముల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైన సిద్దం

మాదిగ రిజర్వే షన్‌ ‌పోరాట సమితి యంఆర్‌పిఎస్‌• ‌మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగింపులో భాగంగా బుధవారం ఆదివాసీ ఉద్యమ యోధులు సోందె వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనం తరం మాట్లాడుతూ  తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు చెందిన భూములను కేసీఆర్‌ ‌ప్రభుత్వం బల వంతంగా లాక్కోవడం చూస్తుంటే నియంత పాలన కనిపిస్తుందని, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ,ఎస్టీ ,పేద వర్గాల ప్రజ లకు సాగు చేసుకునేందుకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తారని అనేక సందర్భాల్లో చెప్పిన కేసీఆర్‌ ‌తెలం గాణలో అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉన్నట •వంటి అంతో ఇంతో భూములను గుంజు కోవడం బాధాకరమని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ , బీసీ, మైనార్టీ పేద ప్రజల వద్ద ఉన్న భూమిని తీసుకొని నిలువ నీడ లేకుండా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు.

కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి హోదాలో అబద్ధాలతో మభ్య పెడుతూ పాలన కొనసాగిస్తున్నారని •కేసిఆర్‌ ‌ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ప్రజలను మోసం చేస్తున్నాడని తన పాలన ఒక నియం తలా కొనసాగుతుందని గుర్తు చేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల చేత కూడా అంటరానితనానికి గురైన మాదిగలకు గోండ్వానా సంక్షేమ పరిషత్‌ ‌పూర్తి సహకారం భూము లను సాధించే విషయంలో ఉంటుం దని అన్నారు. ఏజెన్సీలో మాన్యాలను ఆక్రమించుకుని, దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్న అగ్రవర్ణాల భూస్వాముల నుండి ప్రభుత్వ మాదిగలకు అప్పచెప్పాలని వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో యంఆర్‌పిఎస్‌• ‌జిల్లా సీనియర్‌ ‌నాయకులు అలవాల రాజా మాదిగ పెరియార్‌, ‌యంఆర్‌పిఎస్‌• ‌మండల అధ్యక్షులు లోపల దుర్గాప్రసాద్‌ ‌మాదిగ,  అధికార ప్రతినిధి కనుకు శ్రీనివాస్‌ ‌మాదిగ, మాదిగ మహిళా సమైక్య నాయకులు మిరియాల రమా మాదిగ, చంటి మాదిగ,మేడిపల్లి లక్ష్మి మాదిగ, మీరా, కొమ్మ గిరి వెంకటేశ్వర్లు మాదిగ, కోట ప్రభాకర్‌ ‌మాదిగ, ఈటే అశోక్‌ ‌మాదిగ, రావులపల్లి ఈశ్వర్‌ ‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply