Take a fresh look at your lifestyle.

కొరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూసిన సబ్బం హరి

మేయర్‌గా, ఎంపిగా రాజకీయాల్లో తనదైన ముద్ర
కొరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి.. ఆరోగ్య విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను కొన్ని రోజుల నుంచి వెంటీటేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఆయన కోలుకుని వస్తారని టీడీపీ శ్రేణులు, అభిమానులు భావించారు. అయితే పరిస్థితి విషమించడంతో సబ్బరి హరి చనిపోయినట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న అపోలో హాస్పిటల్వ ర్గాలు ప్రకటించాయి.

కొద్దిరోజుల పాటు హాస్పిటల్లో  చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. కొరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్‌ 15‌న సబ్బం హరికి కొరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు హాస్పిటల్  లో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు.

Leave a Reply