Take a fresh look at your lifestyle.

దాతలు ముందుకు రావడం శుభపరిణామం : మంత్రి

ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి మాటలు అర్థరహితం

సూర్యాపేట, మే 4, ప్రజాతంత్ర ప్రతినిధి):కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ‌కార్యాలయం నందు ఖమ్మం పార్లమెంట్‌ ‌సభ్యులు నామ నాగేశ్వరరావు తన తండ్రి ముత్తయ్య పేరు మీద ఏర్పాటు చేసిన ట్రస్ట్ ‌ద్వారా మంత్రి సమక్షంలో సూర్యాపేట జిల్లాకు 3వేల లీటర్ల శానిటైజర్‌, 3‌వేల మాస్క్‌లు కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు కరోనా నియంత్రణకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే కరోనా మహమ్మారిని పారద్రోలవచ్చునని అన్నారు. లాక్‌డౌన్‌ ‌సడలించినా ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ తోటి వారిపట్ల సేవ భావం కలిగి ఉండాలని కోరారు. కరోనా టె స్టుల విషయంలో ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దెవ చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక పరీక్షలు చేసిన జిల్లాగా సూర్యాపేట నిలించిందన్నారు. కాంగ్రెస్‌ ‌నాయకులు కరోనా పొవొద్దని కోరుకుంటున్నారని ఎద్దెవ చేశారు. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అండ్‌ ‌కో తమ ఉనికి కోసం ఆరాట పడుతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల సమాచరం ఇస్తే ఖచ్చితంగా పరీక్షలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. రైతులు ఎవరూ ఇబ్బందులు పడకుండా రాష్ట్ర చరిత్రలోనే ప్రతి గింజను రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తుందన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ ‌నాయకులు ఆరోపణలు చేసే ముందు తమ హాయాం లో రైతులు విత్తనాల కొనుగోలు నుండి పంటలు అమ్ముకునే వరకు పడిన ఇబ్బందులు గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, ఆర్డిఓ మోహన్‌రావు, జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకటనారాయణ గౌడ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply