Take a fresh look at your lifestyle.

ఎస్‌ ఎం ‌హాస్టళ్లను ప్రారంభించాలి

నాగర్‌ ‌కర్నూల్‌,‌సెప్టెంబర్‌ 12.‌ప్రజాతంత్రవిలేకరి: ఈనెల 18వ తేదీ నుండి  డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా ఎస్‌ఎం ‌హాస్టల్‌ ‌ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ ‌జిల్లా కార్యదర్శి అశోక్‌ ‌గుంపల్లి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మారుమూల గ్రామాల నుండి విద్యార్థులు వచ్చి ఎస్‌ఎం ‌హాస్టల్లో ఉంటూ తమ చదువులు కొనసాగించారని ఇప్పుడు పరీక్షలు రాయాలంటే అంత దూరం నుండి వచ్చి పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు పడతారని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఆటంకాలు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాస్టల్లో కరోన నిబంధనల మేరకు వారికి శానిటైజర్‌ ‌మాస్కులు వంటివి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ‌డివిజన్‌ అధ్యక్షులు క్రాంతికుమార్‌ ,‌మూయిస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply