Take a fresh look at your lifestyle.

వలస కార్మికులకు అండగా నిలిచిన కాంగ్రెస్‌

  • స్వస్థలాలకు వెళ్లే వారి ఛార్జీలను భరిస్తాం
  • కాంగ్రెస్‌ ‌పార్ట్టీ చీఫ్‌ ‌సోనియా గాంధీ
  • రైలు చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయంపై మండిపాటు
  • ఆయా రాష్ట్రాల పిసిసిలు చార్జీలు భరిస్తాయని ప్రకటన

లాక్‌డౌన్‌ ‌కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుని అల్లాడుతున్న వలస కార్మికుల కోసం కాంగ్రెస్‌ ‌పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల ప్రయాణ ఖర్చులను ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ ‌కమిటీలే భరిస్తాయని
ఆ పార్టీ చీఫ్‌ ‌సోనియా గాంధీ ప్రకటించారు. వలస కూలీలు, కార్మికులందరి రైలు ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చులను స్థానిక కాంగ్రెస్‌ ‌కమిటీలు భరించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. వారికి సాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు కాంగ్రెస్‌ ‌పార్టీ తీసుకుంటుందని సోనియా గాంధీ పేర్కొన్నారు. కాగా వలస కార్మికుల కష్టాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమంటూ సోనియా నిప్పులు చెరిగారు. వారి కష్టం, త్యాగం, మన దేశానికి పునాది అని గుర్తుచేశారు. ఈ మేరకు ఆమె కేంద్రానికి లేఖ రాశారు. వలస కార్మికులే దేశానికి వెన్నెముక అనీ.. వారు ఇళ్లకు వెళ్లకుండా చిక్కుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4 గంటలు సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ ‌విధించిందంటూ ఆమె మండిపడ్డారు. తోటి పౌరులైన వలస కార్మికుల సేవలను గౌరవిస్తూ వారికి సహకారం అందించాలని కాంగ్రెస్‌ ‌నిర్ణయించింది. వారితో భుజం భుజం కలిపి నిలబడతాం అని సోనియా గాంధీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చిక్కుకున్న వలసకూలీలను ప్రత్యేక శ్రామిక్‌ ‌రైళ్లలో స్వంత స్థలాలకు తరలిస్తున్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రయాణఛార్జీలు భరించాలని కేంద్రం పేర్కొంది. అయితే కూలీల వద్ద రైల్వే టికెట్‌ ‌వసూల్‌ ‌చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ తప్పుపట్టింది. వలస కూలీల టికెట్ల ఖర్చును తామే భరిస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీలు అన్ని చర్యలు తీసుకుంటాయని ఆమె తెలిపారు. వలస కూలీల సేవలో ఇదో చిన్న సాయంగా భావిస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ పేర్కొన్నది. విపత్కర సమయంలో వారికి సంఘీభావంగా నిలవనున్నట్లు సోనియా తెలిపారు.

లాక్‌డౌన్‌ ‌సమయంలో కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే ఇచ్చారని, దీంతో వలస కూలీలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయినట్లు కాంగ్రెస్‌ ‌పార్టీ ఆరోపించింది. సంక్షోభ సమయంలో కూలీల నుంచి టికెట్‌ ‌చార్జీలు వసూల్‌ ‌చేయడం దారుణమని సోనియా అన్నారు. కూలీలను సురక్షితంగా స్వంత ప్రాంతాల్లో వదలడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇప్పటికీ లక్షలాది మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు ఆమె ఆరోపించారు. అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌కు జనాలను తీసుకువచ్చేందుకు వంద కోట్లు ఖర్చు చేశారని, పీఎం రిలీఫ్‌ ‌ఫండ్‌కు రైల్వే శాఖ 151 కోట్లు ఇచ్చిందని, కానీ కూలీలను తరిలించేందుకు వారి నుంచి టికెట్‌ ‌ఛార్జీ వసూల్‌ ‌చేయడం హేయంగా ఉందన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!