రష్యా ఉక్రెయిన్ పోరు
మాటలతో ప్రారంభమై
పరస్పర భౌతిక దాడుల
దాకా వెళ్లింది
రెండు దేశాల పంచాయితీ
ప్రపంచ సమస్యగా
మారుతుందని అభివృద్ధి
పతంలో ప్రయణిస్తున్న
వర్తమాన దేశాలు
భయపడుతున్నాయి
చినుకు చినుకు వానైనట్టు
సమస్య తీవ్ర స్థాయి
చేరితే మూడో ప్రపంచ యుద్ధం
అనివార్యం కావచ్చు
యుద్ధం వినడానికి రెండు
అక్షరాలు మాత్రమే
దాని పరిణామం
ఊహలకు అందనిది
యావత్తు ప్రపంచం మొత్తం
శాంతిని కోరుకుంటుంది
– మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త