Take a fresh look at your lifestyle.

‌ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరంగల్‌ ‌రూరల్: ‌ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా పర్వతగిరి మండల కేంద్రంలో బుధవారం మంత్రి, జెడ్పి చైర్‌పర్సన్‌ ‌గండ్ర జ్యోతి, వర్ధన్నపేట శాసనసభ సభ్యులు ఆరూరి రమేష్‌లతో కలిసి పర్యటించారు. మండల కేంద్రంలో పల్లెప్రగతిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వీధుల్లో తిరుగుతూ పరిశుభ్రత, మొక్కల పెంపకం, డంప్‌ ‌యార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ గ్రామంలో పుట్టిన ప్రతీ బిడ్డ శ్రమదానంలో పాల్గొనాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అన్నివర్గాల ప్రజల్లో ఆనందాన్ని చూడటానికే అనునిత్యం ఆరాటపడుతున్నామన్నారు. ప్రతి గడపకి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రూ. 45కోట్ల నిధులను వివిధ రకాల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. అనంతరం జెడ్పి చైర్‌పర్సన్‌ ‌గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి పనులతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ ‌మాట్లాడుతూ పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో డంప్‌ ‌యార్డు, వైకుంఠధామం, నర్సరీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags: Rural development, participation, people, Minister Errabelli Dayakarrao

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply