Take a fresh look at your lifestyle.

15‌న ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ ‌కీలక ప్రకటన

డీఎంతో ఎండీ సమీక్షా సమావేశం : ప్రభుత్వానికి నివేదిక

రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహణపై ఈనెల 15న సీఎం కేసీఆర్‌ ‌కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కొరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర నిబంధనల మేరకు రాష్ట్రంలోనూ కొన్ని సడలింపులను అమలు  చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెడ్‌ ‌జోన్లు మినహా జిల్లాలలో కొరోనా ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఆర్టీసీ నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇందులో భాగంగా బస్సులకు అనుమతించిన పక్షంలో ఏ విధంగా నడపాలి ? ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఎలా పాటించాలి ? ముందుగా ఏయే రూట్లలో బస్సులు నడపాలి ? అనే అంశాలపై ఆర్టీసీ ఎండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డీఎంలో సమీక్షా సమావేశం నిర్వహించి వారినుంచి వివరాలు సేకరించారు.బస్సులలో ఎంతమంది ప్రయాణికులను అనుమతించాలి ? బస్టాండ్లలో శానిటైజేషన్‌, ‌ప్రయాణికుల రద్దీని ఏ విధంగా నియంత్రించాలి వంటి అంశాలపై ఎండీ డీఎం)తో సుదీర్ఘంగా చర్చించారు. డీఎంలతో నిర్వహించిన సమావేశంలో సేకరించిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామనీ, అనంతరం ఈనెల 15న సీఎం కేసీఆర్‌ ‌నిర్వహించే సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని పాటించేందుకు డీఎం)ంతా సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో ఎండీ తెలిపారు.

Leave a Reply

error: Content is protected !!