Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌ఛార్జీల పెంపు

గుట్టుచప్పుడు కాకుండా పెంచడంపై తప్పు పడుతున్న ప్రయాణీకులు
హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌చార్జీలు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20 నుంచి 30 వరకు పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చి మూడు వారాలు కావస్తున్నా టీఎస్‌ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. పెంచిన చార్జీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం రహస్యంగా ఉంచడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు.

Leave a Reply