Take a fresh look at your lifestyle.

ఆదాయ మార్గాల అన్వేషణలో ఆర్టీసీ

బస్టాండ్‌లలో పెట్రోలు బంకులు మిగులు సిబ్బందితో నిర్వహణ
రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 92 ఏర్పాటు

రాష్ట్రంలో కోవిడ్‌ ‌కారణంగా లాక్‌డౌన్‌తో భారీ నష్టాలలో మునిగిపోయిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆదాయ వనరులను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకులను నిర్వహించడానికి సంస్థ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నది. హెచ్‌పిసిఎల్‌, ఐఐసిఎల్‌ ‌సంస్థల ద్వారా దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం 92 పెట్రోలు బంకులను ఏర్పాటు చేసి వాహనదారులకు నాణ్యమైన ఇంధనాన్ని అందజేయనుంది. సంస్థలో ఉన్న మిగులు సిబ్బందిని ఈ పెట్రోలు బంకుల నిర్వహణ కోసం
వినియోగించనుంది. టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న పెట్రోలు బంకులలో భాగంగా మొదటి దశలో ఇప్పటికే జనగామ, బీర్కూరు, బిచ్కుంద, ఆసిఫాబాద్‌, ‌హన్మకొండ, మహబూబాబాద్‌ ‌ప్రయాణ ప్రాంగణాలలో నిర్మించబడిన పెట్రోలు బంకులను సంస్థ తన ఆధీనంలోకి తీసుకున్నది. టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో హెచ్‌పిసిఎల్‌, ఐవోసిఎల్‌ ‌ద్వారా స్థాపించిన 92 పెట్రోలు బంకుల నిర్వహణ కోసం గ్రేటర్‌ ‌హైదరాబాద్‌• ‌జోన్‌, ‌హైదరాబాద్‌ ‌జోన్‌, ‌కరీంనగర్‌ ‌జోన్లుగా విభజించింది. ఈ జోన్లలో పెట్రోల్‌ ‌బంకుల నిర్వహణకు సర్వీస్‌ ‌ప్రొవైడర్లను కార్పొరేషన్‌ ‌నియమించింది. అయితే, కరీంనగర్‌ ‌జోన్‌ ‌కాంట్రాక్టర్‌ ‌తన కాంట్రాక్టును మధ్యలోనే రద్దు చేసుకోవడంతో టీఎస్‌ఆర్టీసీ తమ సంస్థలో ఉన్న మిగులు సిబ్బందితో వాటి నిర్వహణను సంస్థ చేతిలోకి తీసుకోనుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ యాజమాన్యానికి విశాలమైన ప్రయాణికుల ప్రాంగణాలు ఉన్నాయి.

వీటిలో పెట్రోలు బంకులను నిర్మించి ఒప్పందం కుదుర్చుకున్న హెచ్‌పిసిఎల్‌, ఐఐసిఎల్‌ ‌సంస్థల ద్వారా వాహనదారులకు పెట్రోలును అందించడం ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నది సంస్థ యాజమాన్యం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ముందుగా ఎంపిక చేసిన పట్టణాలలో పెట్రోలు బంకులను నిర్మించడంతో పాటు వాటి నిర్వహణను కూడా ప్రారంభించింది. ఇక రెండో దశలో ఆయా పట్టణాలలో ముఖ్యమైన కూడళ్లు, జన సమ్మర్థ ప్రాంతాలలో ఆర్టీసీకి ఉన్న ప్రయాణికుల ప్రాంగణాలలో పెట్రోలు బంకులను నిర్మించనుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మార్చి నెల నుంచి లాక్‌డౌన్‌ను అమలు చేసింది. మూడు నెలల అనంతరం రాష్ట్రంలో బస్సుల నిర్వహణకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతించినప్పటికీ గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులను వినియోగించడం లేదు. అంతర్రాష్ట బస్సు సర్వీసులను ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో సంస్థకు ఆదాయం భారీగా తగ్గింది. ఈ బస్సు సర్వీసులను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు వచ్చే బస్సులను సైతం నగర శివార్లకే అనుమతించడం కూడా సంస్థ ఆదాయం కోల్పోవడానికి కారణమైంది. వీటన్నింటి దృష్ట్యా ఇతర ఆదాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించిన ఆర్టీసీ యాజమాన్యం పెట్రోలు బంకుల నిర్వహణ ద్వారా కొంతమేరకైనా నష్టాలను తగ్గించుకోవచ్చని భావిస్తోంది.

అంతర్రాష్ట్ర సర్వీసుల నిర్వహణపై చర్చలు వాయిదా
తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట బస్సు సర్వీసుల నిర్వహణపై చర్చించడానికి జరగాల్సిన సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ అంశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య శుక్రవారం చర్చలు జరపాల్సి ఉండగా, రెండు రాష్ట్రాలలోనూ కొరోనా కేసుల సంఖ్య ఇంకా భారీ స్థాయిలోనూ నమోదు అవుతుండటంతో సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం తిరిగి ఎప్పుడు నిర్వహించే విషయంలో త్వరలో స్పష్టత వస్తుందని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply