Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉంది

  • డీజిల్‌ ‌ధరల పెరుగుదలతో తప్పేలా లేదు
  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్న సంస్థ ఎండి సజ్జన్నార్‌

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌డీజీల్‌ ‌ధరల పెరుగుదల దృష్ట్యా బస్సు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌చెప్పారు. చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ ‌మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపుపై ప్రజల్లో అసంతృప్తి లేదని, చాలా మంది తనతో మాట్లాడారని అన్నారు. నాలుగు నెలలుగా డీజీల్‌ ‌ధర బాగా పెరిగిందని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ఇప్పటి వరకు సర్దుబాబు చేసుకుంటూ నెట్టుకొచ్చామని, మార్చి నెల నుంచి చాలా ఇబ్బందులు వొచ్చాయన్నారు.

ఆర్టీసీ సంస్థ నష్టంలో ఉందని, కోవిడ్‌ ‌నుంచి కోలుకుంటున్న తరుణంలో థర్డ్ ‌వేవ్‌ ‌వొచ్చిందని, ఇప్పుడు డీజిల్‌ ‌ధర పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ సంస్థ ఇంకా నష్టంలో కూరుకుపోయే అవకాశం ఉందని, అందుకే డీజిల్‌ ‌సెస్‌ ‌పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. తమ ప్రతిపాదనను ప్రభుత్వం అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్లు సజ్జనార్‌ ‌చెప్పారు.

Leave a Reply