Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల మధ్య.. నేటి నుంచి పరుగులు పెట్టనున్న ఆర్‌టిసి బస్సులు

అధికారుల మధ్య చర్చలు సఫలం..కుదిరిన ఒప్పందం

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు ఫలించాయి. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మంత్రి పువ్వాడ అజయ్‌ ‌సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్‌లోని బస్‌ ‌భవన్‌లో తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఎండీల కీలక భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య అంతర్‌ ‌రాష్ట్ర బస్సు సర్వీసులపై కీలక చర్చలు జరిపారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు తిప్పే కిలోవి•టర్లపై ఏకాభిప్రాయం కుదిరిన విషయం తెలిసిందే. సమావేశంలో ఆర్టీసీ బస్సు సర్వీసులపై తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల మధ్య ఎన్ని కిలోవి•టర్లు తిప్పాలన్న ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఆంధప్రదేశ్‌లో టీఎస్‌ ఆర్టీసీ 1,61,258 కిలోవి•టర్లు, తెలంగాణలో ఏపీఎస్‌ ఆర్టీసీ 1,60,999 కిలోవి•టర్ల మేర బస్సులను తిప్పనున్నాయి.

ఆంధప్రదేశ్‌లో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులను నడపాలని నిర్ణయించగా, తెలంగాణలో ఏపీ 638 బస్సులను నడపనుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ విజయవాడ రూట్‌లో 273 బస్సులను నడపనుంది. అదే రూట్‌లో ఏపీ 192 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఏపీలో 826 బస్సులను లక్షా 61 వేల 258 కిలోవి•టర్ల మేర టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. తెలంగాణలో 638 బస్సులను లక్షా 60 వేల 999 కిలోవి•టర్ల మేర ఏపీ ఆర్టీసీ నడపనుంది. పలుమార్లు రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగినా ఫలించలేదు. ఎట్టకేలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేశారు. దీంతో నేటినుంచే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.

Leave a Reply