Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బలోపేతానికి వ్యూహం

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ మూడు రోజుల మకాం

RSS Strategy, for strengthening, Telangana state, rss chief mohan bhagat
రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బలోపేతానికి వ్యూహం

‌రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను బలోపేతం చేసే దిశగా సంఘ్‌ ‌నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2024 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ ‌శివార్లలోని ఇబ్రహీంపట్నంలో మూడు రోజుల పాటు విజయ సంకల్ప శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌హాజరువుతున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి రాష్ట్రవ్యాప్తంగా శిబిరానికి హాజరవుతున్న 8 వేల మంది సంఘ్‌ ‌సేవకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

నేడు సరూర్‌నగర్‌ ‌స్టేడియంలో బహిరంగ సభ
విజయ సంకల్ప శిబిరంలో భాగంగా బుధవారం సరూర్‌నగర్‌ ‌స్టేడియంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌ముఖ్య అతిధిగా హాజరయ్యే ఈ సభకు దాదాపు 25 వేల మంది సంఘ్‌ ‌సేవకులు పాల్గొంటారని భావిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరిగే ఈ సభకు నాలుగు మార్గాల ద్వారా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే సంఘ్‌ ‌కార్యకర్తలు స్టేడియంకు చేరుకోనున్నారు. రాష్ట్రంలో రానున్న రోజులలో ఆర్‌ఎస్‌ఎస్‌ను మరింత బలీయమైన శక్తిగా తీర్చిదిద్దే దిశగా మోహన్‌ ‌భాగవత్‌ ‌కార్యకర్తలకు మార్దనిర్దేశం చేస్తారని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ ఆయుష్‌ ‌నడింపల్లి తెలిపారు.

Tags: RSS Strategy, for strengthening, Telangana state, rss chief mohan bhagat

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!