Take a fresh look at your lifestyle.

ఒక్కో ఉద్యోగికి రూ.6 కోట్లు బోనస్‌..!

ప్రంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంలో ఓ చైనా కంపెనీ ఉద్యోగులకు ఊహించనంత బోనస్‌
‌బీజింగ్‌, ‌జనవరి 31 : ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు ఆర్థిక మాంద్యం తెచ్చిన కష్టాలతో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి వేలాదిమంది ఉద్యోగుల్ని తీసేస్తుస్తున్న వేళ కొరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఒక్క ఉద్యోగిని అంటే ఒక్క ఉద్యోగిని కూడా తీసేయలేదు. పైగా 30మంది ఉద్యోగులకు ఊహించనంత బోనస్‌ ఇచ్చింది. ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ ‌యువాన్లు అంటే భారత కరెన్సీలో రూ.6 కోట్లు బోనస్‌గా ఇచ్చింది. ఆ బోనస్‌ను ఏకంగా కరెన్సీ రూపంలో ఇచ్చేసరికి కరెన్సీ కట్టల్ని మోసుకెళ్లటానికి సదరు ఉద్యోగులు పడిన పాట్లు సోషల్‌ ‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూసిన ఉద్యోగులు ఏమా కంపెనీ మామూలుగా లేదుగా బోనస్‌ల బొనాంజా అంటున్నారు. క్రేన్లను ఉత్పత్తి చేసే చైనాకు చెందిన హెనాన్‌ ‌మైన్‌ అనే కంపెనీ తమ ఉద్యోగులకు భారీగా బోనస్సులు ప్రకటించింది. అంతేకాదు ఆ బోనస్‌ను కరెన్సీ కట్టల రూపంలో ఇచ్చింది. ఆ భారీగా కట్టల రూపంలో పేర్చింది. ప్రకటించిన బోనస్‌ను ఉద్యోగుల వారి బ్యాంక్‌ ఎకౌంట్స్‌లో జమ చేయకుండా ప్రత్యేకంగా కరెన్సీ కట్టల రూపంలో ఇచ్చింది. ఈ ప్రక్రియను పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి నగదును కట్టకట్టలుగా వేదికపై పేర్చి మరీ అందించింది. దీంతో కంపెనీ అందించే బోనస్‌ ‌మొత్తాన్ని చేతులతో తీసుకెళ్లలేక సదరు ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకోవడం స్టేజీపైకి ఉద్యోగుల్ని పిలిచి కట్టలుగా ఇవ్వటంతో ఆ కరెన్సీ కట్టల్ని పట్టుకెళ్లటానికి ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు. ఓ పక్క ఆనందం..మరోపక్క ఉద్వేగంతో కట్టల్ని మోసుకుంటూ స్టేజీ దిగిన ఫోటోలు సోషల్‌ ‌మీడియాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

కొరోనా కారణంగా పలు కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోయినా హెనాన్‌ ‌మైన్‌ ‌కంపెనీ మాత్రం భారీ లాభాలు ఆర్జించింది. దీంతో ఈ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించి ఇలా వినూత్నంగా కరెన్సీ కట్టల రూపంలో అందజేసింది. కంపెనీ సేల్స్ ‌విభాగంలో మంచి పనితీరు కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్‌ ‌యువాన్లు భారత కరెన్సీలో సుమారు రూ. 73 కోట్లు బోనస్‌గా ప్రకటించింది. ఉద్యోగుల్లో అత్యుత్తమైన పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ ‌యువాన్లు (సుమారు రూ.6 కోట్లు) చొప్పున అందించగా మిగిలిన వారికి ఒక్కొక్కరికి ఒక్కో మిలియన్‌ ‌యువాన్లు అంటే సుమారు రూ.1.20 కోట్లు బోనస్‌గా అందజేసింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలు సోషల్‌ ‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Leave a Reply