Take a fresh look at your lifestyle.

కేంద్రం నుంచి రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ

  • ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నం
  • హాస్పిటళ్లలో పిల్లల సంరక్షణ/పిల్లల పడకల కోసం రూ.23,320 కోట్లు
  • టూరిజం తదితర రాంగాలకు చేయూత
  • మిడియా సమావేశంలో వివరాలు ప్రకటించిన కేంద్రం

కొరోనాతో దెబ్బతిన్న రంగాలకు కేంద్రం మరోమారు ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్‌ ‌నేపథ్యంలో 8 రంగాలకు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు. గత ఏడాది కొరోనా ఫస్ట్ ‌వేవ్‌ ‌నేపథ్యంలోనూ కొన్ని రంగాలకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. ఆత్మనిర్బర్‌ ‌భారత్‌లో భాగంగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించారు. కోవిడ్‌ ‌వల్ల దెబ్బతిన్న రంగాలకు 1.1 లక్ష కోట్ల లోన్‌ ‌గ్యారెంటీ ఇవ్వనున్నారు. వైద్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు 50 వేల కోట్లు ఇవ్వనున్నారు. క్రెడిట్‌ ‌గ్యారెంటీ స్కీమ్‌ ‌కింద 25 లక్షల మందికి రుణాలు ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్‌ ‌తెలిపారు. మైక్రో ఫైనాన్స్ ‌సంస్థలకు ఈ రుణం అందించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు రూ.6.29 లక్షల కోట్ల ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ‌ప్యాకేజీ వివరాలను సోమవారంనాడు వి•డియా సమావేశంలో తెలియజేశారు. మొత్తం ప్యాకేజీలో భాగంగా రూ.23,320 కోట్ల రూపాయలను హాస్పిటళ్లలో పీడియాట్రిక్‌ ‌కేర్‌/‌పీడియాట్రిక్‌ ‌పడకల కోసం కేటాయిస్తారు. నవంబర్‌ 2021 ‌వరకూ పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందిస్తారు. ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజన కింద రూ.2.27 లక్షల కోట్లు ఇందుకు వెచ్చిస్తారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రానికి మాన్యుఫాక్చరింగ్‌ ‌కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను మరో ఏడాది పొడిగించారు. రైతులకు అదనంగా రూ.14,775 కోట్ల మేరకు ఎరువుల సబ్సిడీ ఇస్తారు.

మొదటి 5 లక్షల మంది పర్యాటకులకు వీసా రుసుము రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రావెల్‌ ఆం‌క్షలను సరళతరం చేయగానే భారతదేశానికి వచ్చే మొదటి 5 లక్షల మంది పర్యాటకులకు వీసా ఫీజును ప్రభుత్వం రద్దు చేస్తుందని నిర్మలా సీతారామన్‌ ‌ప్రకటించారు. పర్యాటక రంగానికి బాసటగా నిలిచేందుకు ట్రావెల్‌ ఏజెన్సీలకు రూ.10 లక్షల వరకూ రుణ సదుపాయం, టూరిస్టు గైడ్‌లకు రూ.1 లక్ష వరకూ రుణాలిస్తారు. కొత్త పథకం కింద చిన్నరుణాలు తీసుకునే వారికి రూ.1.25 లక్షల చొప్పున రుణాలు ఇస్తారు. 25 లక్షల మంది ఇందువల్ల లబ్ది పొందుతారు. స్వల్ప వడ్డీ రేటుకు ఈ రుణాలు ఇస్తారు. ఎమ్జర్జెన్సీ క్రెటిడ్‌ ‌లైన్‌ ‌గ్యారెంట్‌ ‌స్కీమ్‌కు అదనంగా రూ.1.5 లక్షల కోట్లు కేటాయిన్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈ, ఇతర రంగాలకు కొలేటరల్‌-‌ఫ్రీ లోన్‌గా వీటిని ఇస్తారు. కోవిట్‌ ‌బాధిత ప్రాంతాలకు రూ.1.1 లక్షల కోట్ల లోన్‌ ‌గ్యారెంటీ స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. ఇతర రంగాలకు సుమారు 60 వేల కోట్ల రిలీఫ్‌ ‌ప్యాకేజీని మంత్రి ప్రకటించారు.

ఆ రుణాలకు పన్ను వసూల్‌ ‌శాతాన్ని 8.25 శాతంగా ఫిక్స్ ‌చేశారు. ట్రావెల్‌, ‌టూరిజం రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. 11వేల మంది టూరిస్టు గైడ్లు, ట్రావెల్‌, ‌టూరిజం స్టేక్‌హోల్డర్లకు రుణాలు కల్పిస్తారు. వంద శాతం గ్యారెంటీతో ఆ రుణాలు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల రాక మొదలైన తర్వాత తొలి 5 లక్షల మంది టూరిస్టులకు ఉచితంగా వీసాలు ఇవ్వనున్నట్లు మంత్రి సీతారామన్‌ ‌చెప్పారు. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజనను ఈ ఏడాది జూన్‌ 30‌వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.23,220 కోట్లు కేటాయించారు. చిన్నారుల సంరక్షణపై ఈ స్కీమ్‌లో ఎక్కువగా కేంద్రీకరించినట్లు మంత్రి నిర్మల తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. నర్సులు, డాక్టర్లు, వైద్య పరికరాలు, అంబులెన్సులు, ఆక్సిజన్‌ ‌ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆ మొత్తాన్ని వినియోగిస్తారు. కానీ చిన్నారుల భద్రతే ముఖ్యంగా ఆ నిధుల్ని ఖర్చు చేస్తారు. కోవిడ్‌ ‌కేంద్రీకృత హాస్పిటళ్లు 25 శాతం పెరిగినట్లు ఆమె చెప్పారు. 42 శాతం ఐసోలేషన్‌ ‌బెడ్స్, 45 ‌శాతం ఐసీయూ బెడ్స్ ‌పెరిగినట్లు మంత్రి తెలిపారు. ఫర్టిలైజర్ల సబ్సిడీ కోసం 14,775 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో గోధుమలను సేకరించినట్లు మంత్రి చెప్పారు. రబీ మార్కెట్‌ ‌సీజన్‌ ‌వేళ నేరుగా రైతుల అకౌంట్లోకి 85,413 కోట్లు బదిలీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. వి•డియా సమావేశంలో సహాయమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌కూడా పాల్గొన్నారు.

Leave a Reply