Take a fresh look at your lifestyle.

గాంధీలో డెడ్‌ ‌బాడీని ప్యాక్‌ ‌చేయడానికి.. రూ.30 వేలు

ప్రభుత్వం డెడ్‌ ‌బాడీ ప్యాక్‌ ‌చేసి ఇవ్వలేదా..?
ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత సీఎస్‌కు లేదా ..!
:కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి
సచివాలయ పరిశీలన పిటిషన్‌ను హైకోర్ట్ ‌స్వీకరించింది : ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి చీఫ్‌ ‌సెక్రెటరీపై ఫైర్‌ అయ్యారు. సీఎం సెక్రటేరియట్‌ ‌కట్టడంలో బిజీగా ఉంఓశీ మరి చీఫ్‌ ‌సెక్రటరీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌లో ఆయన మాట్లాడుతూ …సీఎం కేసీఆర్‌ ‌కొత్త సెక్రటేరియట్‌ ‌బిల్డింగ్‌ ‌కి డిజైన్‌ ‌చేస్తుంటే సీఎస్‌ ‌కొత్త ఆ డిజైన్‌కు సున్నాలు కొడుతున్నారా అంటూ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత సీఎస్‌కు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరోనాకు గురౌతున్న తన నియోజకవర్గ ప్రజల కోసం త్వరలో ఒక కార్యాచరణ తీసుకుంటానని అన్నారు. వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చిన వారిలో మెజారిటీ పేషంట్లు గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చనిపోతున్నారని జిల్లా హాస్పిటల్స్‌లో పాజిటివ్‌ ‌పేషంట్లను గాంధీకి పంపిస్తున్నారని అక్కడికెళితే పదిలో ఐదుగురు మరణిస్తున్నారని అన్నారు. సంగారెడ్డికి చెందిన అబ్దుల్‌ ‌ఖయూమ్‌ అనే వ్యక్తి గాంధీలో చేరి తనను ఎవరూ చూడడం లేదని కొడుక్కి ఫోన్‌ ‌చేసి చెప్పారని చెప్పినట్లుగానే గురువారం వైద్యం అందక అతడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గాంధీ హాస్పిటల్‌ ‌సిబ్బందిని తప్పుపట్టడం లేదన్నారు. వంద మంది పేషంట్లకు ఒక్క డాక్టర్‌ ఉం‌టే వారు మాత్రం ఏమి చేస్తారని అన్నారు. మరొక పేషంట్‌ను కూడా గాంధీకి రిఫర్‌ ‌చేస్తే మేము అక్కడికి వెళ్లకుండా ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తీసుకు వెళ్ళామని అక్కడ ప్రస్తుతం ఆ పేషేంట్‌ ‌కోలుకుంటున్నారని తెలిపారు. ఎందుకు ఆ తేడా ఉంటుందో వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల దృష్టి పెట్టాలని సూచించారు. డబ్బులు లేని వారే గాంధీకి వెళుతున్నారని కానీ అక్కడ డెడ్‌ ‌బాడీని ప్యాక్‌ ‌చేసి ఇవ్వడానికి కూడా 30వేలు తీసుకుంటున్నారని ప్రభుత్వం ఎలాగూ బతికే అవకాశం ఇవ్వడం లేదు, కనీసం డెడ్‌ ‌బాడీని కూడా ప్రభుత్వం ప్యాక్‌ ‌చేసి ఇవ్వలేదా? అని ఆయన నిలదీశారు. ఇంత నీచంగా ప్రభుత్వం పని చేస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు.

సచివాలయ పరిశీలన పిటిషన్‌ను హైకోర్ట్ ‌స్వీకరించింది : ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సచివాలయ కూల్చివేత కార్యక్రమ క్షేత్ర పరిశీలనకు అనుమతి కోరుతూ కాంగ్రెస్‌ ‌నేతల పిటిషన్‌ను హైకోర్ట్ ‌పిల్‌గా మార్చి విచారణకు స్వీకరించినట్లు తెలపుతూ శుక్రవారం ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ఒక ప్రెస్‌ ‌నోట్‌ ‌రిలీజ్‌ ‌చేశారు. వాస్తవంగా సచివాలయ కూల్చివేత వద్ద ఏం జరుగుతుందో పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి జూలై 29న డీజీపీ మహాందర్‌ ‌రెడ్డి, సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌లను కోరుతూ లేఖ రాశారు. ఆ లేఖపై ఎలాంటి స్పందన లేకపోవడంతో జూలై 30న మరో లేఖ రాశారు. అప్పటికి డీజీపీ, సిటీ పోలీస్‌ ‌స్పందించకపోవడంతో కాంగ్రెస్‌ ‌నేతలు మాజీ మాంత్రి షబ్బీర్‌ అలీ ఆధ్వర్యంలో ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డిలు హైకోర్ట్‌ని ఆశ్రయించారు. దీంతో కోర్ట్ ‌శుక్రవారం కాంగ్రెస్‌ ‌దాఖలు చేసిన రిట్‌ ‌పిటీషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా మార్చిన హైకోర్ట్ ‌విచారణకుస్వీకరించింది. సోమవారం ఈ పిల్‌ ‌విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. సచివాలయం జి బ్లాక్‌ ‌లో గుప్తనిధులపై మొదటి నుంచి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. నల్లపోచమ్మ గుడి, మసీదు కూల్చివేతను కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ సీరియస్‌గా పరిగణిస్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!