Take a fresh look at your lifestyle.

కొరోనా తో ఉపాధి కొల్పోయిన ప్రైవేట్ అధ్యాపకులకు.. రు.1000 కోట్లు విడుదల చేయాలి..

వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్.ఎల్.సి అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్
ఉపాధి కోల్పోయి తల్లడిల్లితున్న ప్రైవేట్ అధ్యాపకులకు 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలని వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్.ఎల్.సి అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. తిరుమలగిరి కేంద్రం లో ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఎమ.ల్.సి ఎన్నికల సన్నాహక సమావేశానికి డాక్టర్ చెరుకు సుధాకర్ హజరై మాట్లాడుతూ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తయని,ఏదో ఒక రంగంలో ఉపాధి దొరుకుతదని విద్యార్థులు ఉవ్వెత్తున పాల్గొన్న సంగతిని స్వరాష్ట్ర పాలకులు యాది మరిచినారని ఇది ఉద్యమ స్పూర్తికి విరుద్దమన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నికలు కొత్తేమి కాదు.. కాని ఎమ్.ఎల్.సి ఎన్నికలు రాష్ట్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాయి. అధికార పార్టీ బరితెగించి చరిత్రలో ఎన్నడులేని విధంగా పట్టభద్రుల పట్టా కాగితాల కోసం వెంపర్లాడుతున్నాయన్నారు.వారి ఉపాధి గురించి అడుగరు,వారి బతుకల గురించి పట్టించుకోరు.. వాల్ల వోట్లు మాత్రం కావాలి.. టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన తీరు ఇదేనా అన్నారు.రాష్ట్రంలో అందరం కోట్లాడితినే తెలంగాణ వచ్చింది కాని ఏ ఒక్కరో కోట్లాడితే తెలంగాణ రాలే.చాలా దుర్మార్గంగా కొంతమంది మా ఒక్కని వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నారు..ఇది సరికాదన్నారు. ఉద్యమకారులను గెలిపించకుండా ఉద్యమ ఆకాంక్ష లు అమలు సాధ్యం కాదన్నారు.ఊద్యమ ద్రోహులతో  పాలకవర్గం కలుషితమైందన్నారు.ఆచరణకు  నోచుకోని అనేక హమీలు ఇఛ్చి కాలం వెలిబుచ్చుతున్నారన్నారు.
పార్టీలకతీతంగా నిరుద్యోగులు,మేధావులు, ఉపాధ్యాయులు,పట్టభద్రులందరు జరగబోయే నల్లగొండ వరంగల్ ఖమ్మం ఎమ్.ఎల్.సి ఎన్నికలలో ఉద్యమ నాయకునికి అండగా నిలబడతారని,మీ తరుపున ప్రశ్నించే గొంతుకగా కోట్లాడుతానని డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఈ సమావేశంలో యారాల నర్సింహ్మా రెడ్డి,విప్లవ్ కుమార్, ప్రశాంత్,శేఖర్, శ్రీనివాస్, సందీప్, దుస్సా రామూర్తి,శ్రీకాంత్ గౌడ్,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply