Take a fresh look at your lifestyle.

యుపిలో స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు

  • 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు లబ్ది
  • ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో మహిళల ఖాతాలకు నగదు
  • యూపి పర్యటనలో ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌మహిళలకు అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ సుమారు 16 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చే స్వయం సహాయక సంఘాలకు రూ. 1,000 కోట్లను బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ప్రయాగ్‌రాజ్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశమయ్యారు. ప్రయాగ్‌రాజ్‌లోని 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆన్‌లైన్‌లో 1,000 కోట్లను బదిలీ చేశారు. దీనదయాళ్‌ అం‌త్యోదయ యోజన జాతీయ గ్రావి•ణ జీవనోపాధి మిషన్‌ ‌కింద ఈ మొత్తం బదిలీ చేయడం జరగుతుంది.
ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో లక్షలాది మంది మహిళల ఖాతాలకు కోట్లాది రూపాయలను బదిలీ చేసే భాగ్యం ఈరోజు లభించిందన్నారు. యూపీలో ప్రారంభించిన బ్యాంక్‌ ‌సఖీ ప్రచారం మహిళల జీవితాల్లోనూ పెనుమార్పులు తీసుకొస్తుంది. డీబీటీ ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఖాతాకు వొస్తుంది. వి•రు డబ్బు విత్‌‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లనవసరం లేదు, బ్యాంకు స్నేహితుని సహాయంతో వి•రు ఈ డబ్బును ఇంట్లోనే పొందుతారు. ఈ విధంగా గ్రామానికి బ్యాంకు వస్తుంది. ఇదేవి• చిన్న పని కాదు. 75 వేల కోట్ల విలువైన లావాదేవీల బాధ్యతను ఈ బ్యాంకు స్నేహితులకు యూపీ ప్రభుత్వం అప్పగించింది. గ్రామంలో ఎంత ఎక్కువ లావాదేవీలు జరిగితే అంత ఆదాయం పెరుగుతుంది. దీని ప్రకారం ఒక్కో స్వయం సహాయక బృందానికి రూ.1.1 లక్షల చొప్పున 80 వేల గ్రూపులు కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌ఫండ్‌ (‌సీఐఎఫ్‌) ‌పొందుతుండగా, ఒక్కో స్వయం సహాయక బృందానికి రూ.15 వేల చొప్పున 60 వేల గ్రూపులు కార్యాచరణ నిధులు పొందుతున్నాయి. ఇది కాకుండా, 202 టెక్‌ ‌హోమ్‌ ‌రేషన్‌ ‌ప్లాంట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 20 వేల బిజినెస్‌ ‌కరెస్పాండెంట్‌ ‌సఖీ బీసీ సఖీ ఖాతాలకు తొలి నెల రూ.4000 గౌరవ వేతనం కూడా బదిలీ చేశారు. బిజినెస్‌ ‌కరస్పాండెంట్‌ ఇం‌టింటికీ ఆర్థిక సేవలను అందిస్తారు. పర్మినెంట్‌గా పనిచేసేందుకు వీలుగా వారికి 6 నెలల పాటు రూ.4000 గౌరవ వేతనం ఇస్తున్నారు.
పని పెరిగిన తర్వాత, వారు లావాదేవీలో ఉన్నప్పుడు కవి•షన్‌ ‌నుండి సాధారణ ఆదాయాన్ని పొందడం ప్రారంభించారు. ప్రధానమంత్రి కార్యక్రమం సందర్భంగా, ముఖ్యమంత్రి కన్యా సుమంగళ్‌ ‌యోజన కింద లక్ష మందికి పైగా లబ్దిదారులకు రూ. 20 కోట్లకు పైగా నగదు బదిలీ కూడా ప్రారంభించారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టిన సందర్భంగా రెండు వేల రూపాయలు, ఒక సంవత్సరం తర్వాత అవసరమైన అన్ని టీకాలు వేసిన తర్వాత వెయ్యి రూపాయలు, ఫస్ట్ ‌క్లాస్‌లో అడ్మిషన్‌ ‌తీసుకున్న తర్వాత 2000 రూపాయలు వంటి వివిధ దశల్లో నగదు నగదు బదిలీ చేయబడుతుంది.

Leave a Reply