Take a fresh look at your lifestyle.

161 ‌పరుగలతో చెలరేగిన రోహిత్‌ ‌శర్మ

  • తొలిరోజు ఆటలో భారత్‌ ‌పట్టు
  • ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు
  • 67 పరుగలతో ఆదుకున్న రహానే

చెపాక్‌ ‌వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ‌జట్టు పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. తొలుత టాస్‌ ‌గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎం‌చుకుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం దృష్ట్యా ఈ టెస్టులో కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. తొలి సెషన్‌లో ఓపెనర్‌ ‌శుభ్‌మన్‌ ‌గిల్‌తో పాటు కెప్టెన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. దానికి తోడు టెస్టు స్పెషలిస్ట్ ‌బ్యాట్స్‌మెన్‌ ‌చతేశ్వర్‌ ‌పుజారా(21) కూడా తక్కువ పరుగులకే అవుట్‌ ‌కావడంతో టీమిండియా 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఓపెనర్‌ ‌రోహిత్‌ ‌శర్మ 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో (161) పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు.

అతడికి తోడు ఆజింక్య రహానే 149 బంతుల్లో 9 ఫోర్లతో (67) రన్స్ ‌చేసి క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్‌ ‌భారీ స్కోర్‌ ‌చేయగలిగింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌: 300/6‌తో ఉంది. భారత్‌ ‌బ్యాటింగ్‌లో రోహిత్‌ (161), ‌రహానే (67), పుజారా (21) చేయగా.. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌ ‌పంత్‌ (33), అక్షరపటేల్‌ (5)‌తో అజేయంగా నిలిచారు. ఇంగ్లండ్‌ ‌బౌల్లరలో లీచ్‌, ‌మొయిన్‌ అలీ రెండు వికెట్లు తీయగా స్టోన్‌, ‌రూట్‌లకు తలో వికెట్‌ ‌దక్కాయి. రోహిత్‌ ‌శర్మ, అజ్యింకా రహానే రాణించడంతో టీమిండియా పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఈ జోడీ 162 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా తిరిగి తేరుకుంది. టాస్‌ ‌గెలిచి బ్యాటింగ్‌ ఎం‌చుకున్న టీమిండియా.. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో రోహిత్‌-‌రహానేల జోడి ఆదుకుంది.

వీరిద్దరూ స్పల్ప వ్యవధిలో ఔటైన తర్వాత టీమిండియా శిబిరంలో కాస్త ఆందోళన నెలకొంది. ఇన్నింగ్స్ 73 ఓవర్‌లో రోహిత్‌ ఔట్‌ ‌కాగా, 76 ఓవర్‌లో రహానే పెవిలియన్‌ ‌చేరాడు. రోహిత్‌ను జాక్‌ ‌లీచ్‌ ‌బోల్తా కొట్టించగా, రహానేను మొయిన్‌ ఒక అద్భుతమైన బంతితో బౌల్డ్ ‌చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి ఆఫ్‌ ‌సైడ్‌ ‌పడి వికెట్ల వి•దుకు రావడంతో రహానే ఔటయ్యాడు. ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ ‌శుబ్‌మన్‌ ‌గిల్‌ ‌డకౌట్‌ ‌కాగా, విరాట్‌ ‌కోహ్లి కూడా పరుగులేవి• చేయకుండానే నిష్కమ్రించాడు. తొలి రెండు సెషన్లు ఇంగ్లండ్‌పై స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన టీమిండియా చివరి సెషన్‌లో మాత్రం కాస్త తడబడింది. లంచ్‌ ‌విరామం తర్వాత టీ సెషన్‌ ‌వరకు మరొక వికెట్‌ ‌కోల్పోకుండా జాగ్రత్తగా ఆడిన భారత జట్టు చివరి సెషన్‌లో మాత్రం మూడు వికెట్లు చేజార్చుకుంది.

Leave a Reply