Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో రోహింగ్యాల ఆచూకీ కనిపెట్టండి

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం
  • డీజీపీకి బీజేపీ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి

రాష్ట్రంలో అక్రమంగా ఎంతమంది రోహింగ్యాలు చొర•డ్డారో గుర్తించి శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని బీజేపీ ప్రతినిధి బృందం డీజీపీకి విజ్ఞప్తి చేసింది. రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో 127 మంది అక్రమంగా ఆధార్‌ ‌కార్డులు పొందినట్లు వెల్లడైనందున ఇంకా ఇలాంటి వారు ఎంత మంది ఉన్నారో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఈమేరకు పోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మ్మణ్‌ ‌నేతృత్వంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పార్టీ నగర ప్రధానకార్యదర్శులు టి.రాజశేఖరరెడ్డి, గౌతమ్‌రావు, రామకృష్ణ, ఆలె జితేందర్‌ ‌డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పౌరసత్వం లేని వారు ఇక్కడి ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సైతం భారీ నష్టం వాటిల్లు•తుందన్న విషయాన్ని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.

 

రాష్ట్రంలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించి అక్రమంగా నివసిస్తున్న విషయంపై పోలీసు శాఖకు గతంలో బీజేపీ ఎన్నోమార్లు వినతిపత్రాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎంతో మంది నకిలీ ధృ వప త్రాలతో ఆధార్‌ ‌కార్డులు పొం దారనీ, వీరితో శాంతి భద్ర తల పరంగా స మస్యలు తలెత్తు తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ పోలీసు శాఖ తమ విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 127 మంది ఆధార్‌కార్డులు పొందారనీ, వీటిని రద్దు చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు ఐఎస్‌ఐ, అల్‌ ‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థల అండతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోహింగ్యాలు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులనీ, వారు రాష్ట్రంలో నివసించడం జాతి ప్రయోజనాలకు భంగం కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఎంత మంది అక్రమంగా ప్రవేశించిన వారు నివసిస్తున్నారనే విషయంపై వాప్తవాలు బయటపెట్టడానికి పోలీసు శాఖలోని నిజాయితీ పరులతో బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!