Take a fresh look at your lifestyle.

ఎపిలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

అమరావతి,మే 21 : ఏపీలో ఆర్టీసీ బస్సులు రోడ్లదకు వచ్చాయి. 13 జిల్లాల పరిధిలో 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభం అయ్యాయి. రెండు నెలల తరువాత ప్రయాణికులతో ఆర్టీసీ బస్‌ ‌స్టాండ్‌ ‌లు కళకళలాడుతున్నాయి. బస్‌ ‌స్టాండ్‌లో మాస్క్‌లు లేని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివారికి ప్రయాణ అవకాశం ఉండదని, వెంటనే మాస్కులు ధరించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. టికెట్‌ ‌కౌంటర్ల వద్ద భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తరువాతే విధుల్లోకి అనుమతిస్తున్నారు. బస్‌స్టాండ్‌ ‌లకు చేరుకుంటున్న ప్రయాణికులు తమ ఊళ్ళకు వెళ్లేందుకు బస్సులు ఎక్కడ వున్నాయో తెలుసుకుంటున్నారు. విజయవాడ నుండి విశాఖకు బయల్దేరింది మొదటి సూపర్‌ ‌లగ్జరి బస్సు. దూరప్రాంతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆర్టీసీ అధికారులు విశాఖ, రాజమండ్రి, కాకినాడలకు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఆన్‌ ‌లైన్‌ ‌రిజర్వేషన్‌ ‌టికెట్‌ ఉం‌టేనే బస్‌ ‌స్టాండ్‌ ‌లోకి ప్రయాణికుల అనుమతి వుంటుంది. గతంలోలాగా బస్సుల్లో టికెట్లు జారీచేయడం ఉండదని ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటు అనంతపురం జిల్లాలో ఉదయం నుంచి రోడ్డెక్కాయి ఆర్టీసీ బస్సులు. జిల్లా వ్యాప్తంగా 111 బస్సులు.. వివిధ మార్గాల్లో పయనం సాగిస్తు న్నాయి.

కర్నూలు కడప తో పాటు జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. టికెట్లు కేవలం ఆన్‌ ‌లైన్‌ ‌లోనూ లేదా బస్‌ ‌స్టాండ్‌ ‌లో తీసుకునే అవకాశం వుండడంతో కౌంటర్లలో జనం ఎక్కువగా కనిపిస్తున్నారు. రెండు నెలల తర్వాత రోడ్డుపై కనిపిస్తున్న బస్సులతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కండక్టర్‌ ‌లేకుండా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి . ఇటు సీట్లలోనూ దూరం పాటిస్తున్నారు.స్టాండింగ్‌ ‌ప్రయాణాలకు ఆర్టీసీ అనుమతివ్వడం లేదు. దీంతో వచ్చిన బస్సుల్లో తక్కువ మందే ప్రయాణించే అవకాశం ఉండడంతో కొన్ని రూట్లలో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఆర్టీసీకి 1200 కోట్ల రూపాయల వరకూ నష్టం జరిగింది. ఆన్‌ ‌లైన్‌ ‌రిజర్వేషన్‌ ‌ద్వారా నగదు రహిత విధానంలో టిక్కెట్లు జారీ చేస్తున్నామని ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ‌చెప్పారు. నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏపీ బస్సులు నడుపుతామని ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy