Take a fresh look at your lifestyle.

కందులు కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు

- Advertisement -

Roadside farmers, Arrest BJP,Shiv Sena leaders,civic movements,CPI
బిజెపి, శివసేన నాయకుల అరెస్ట్ – ‌ప్రజా ఉద్యమాలు తప్పవు : సీపీఐ

హుస్నాబాద్‌, : ‌హుస్నాబాద్‌ ‌వ్యవసాయమార్కెట్‌ ‌కార్యాలయంలో రైతులు తీసుకువచ్చిన తృణ దాన్యాలు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్న అధికారులు,పాలకవర్గంపై మండిపడ్డ రైతులు రోడ్డెక్కి నిరసన చేశారు.ఇందుకు మద్దతుగా నిలిచిన బీజేపీకి చెందిన పట్టణ అద్యక్షుడు బత్తుల శంకర్‌ ‌కవ్వ వేణుగోపాల్‌ ‌శివసేనకు చెందిన అక్కన్నపేట మండల అద్యక్షుడు గుగులోతు భాస్కర్‌నాయక్‌ ‌వెల్దండి సంతోష్‌ ‌తదితర నాయకులను అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.బుధవారం రోజున స్థానిక ఏఎంసీ కార్యాలయం ముందు రోడ్డుపై రైతులు సుమారు రెండు గంటలు ఆందోళన చేశారు.వ్యవసాయ మార్కెట్లో గత రెండు మూడు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి రైతులు తీసుకువచ్చిన కందులను కొనుగోలు చేయాల్సింది పోయి నిబంధలనల పేరుతో మార్కుఫెడ్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్పందించాల్సిన వ్యవసాయ మార్కెట్‌ ‌కార్యాలయ అధికారులు పాలకవర్గం మాముళ్ల మత్తులో మద్య దళారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.దీనికి తోడు ప్రభుత్వం రాత్రికి రాత్రే కొనుగోల్లు నిలిపివేయడంతో రైతులు అయోమయానికి గురి కావాల్సి వచ్చిందనీ అసహనం వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు రైతులు నాయకులు ఆందోళన చేస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి సమాధానం చెప్పకపోవడం శోచనీయమన్నారు.నిలిపిన కందుల కొనుగోలును తిరిగి చేపట్టాలని డిమాండు చేశారు.స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ ‌స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనగామ వేణుగోపాల్‌ ‌రావు కందుకూరి సతీశ్‌ ‌రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలు తప్పవు : సీపీఐ
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తే ఊర్కోబోమని తెచ్చిన పంట దినుసులను వెంటనే కొనుగోలు చేసి డబ్బులు వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సభ్యుడు గడిపె మల్లేశ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.ట్రేడర్లతో ఏఎంసీ అధికారులు,పాలకవర్గం కుమ్మక్కై బయట కొనుగోళ్లను ప్రోత్సహిస్తే ప్రజలతో కల్సి రైతుల కోసం ఉద్యమాలు చేపట్టాల్సి వస్తోందని బుధవారం నాడొక ప్రకటనలో నాయకులతో కల్సి హెచ్చరించారు.

Tags: Roadside farmers, Arrest BJP,Shiv Sena leaders,civic movements,CPI

Leave a Reply