Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: కమిషనర్‌

Road safety rules should be followed Commissioner

‌ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని బల్దియా కమిషనర్‌ ‌పమేలా సత్పతి అన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో సంబంధ క్యాంపక్ట్ ‌డిస్క్(‌సి.డి), పెన్‌ ‌డ్రైవ్‌లను కమిషనర్‌ ‌బుధవారం ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ ‌మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో 150 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని, స్వచ్ఛ సర్వేక్షన్‌ ‌కార్యక్రమంపై అవగాహనతో పాటు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలను పాటించేలా ప్రత్యేకమైన ఆడియోలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తామని కమిషనర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ‌మోటార్‌ ‌వెహికల్‌ ఇన్స్పెక్టర్లు ఫాహిమ సుల్తానా, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Commissioner, Compact Disk (CD) Pen Drives,Road safety rules, followed Commissioner

Leave a Reply