Take a fresh look at your lifestyle.

నేడు చక్కాజామ్‌తో రహదారుల దిగ్బంధం

రైతుల ఆందోళన కార్యక్రమంతో అప్రమత్తం అయిన కేంద్రం
దేశవ్యాప్తంగా శనివారం రైతులు చక్కా జామ్‌తో రహదారుల దిగ్బంధం కార్యక్రమం నిర్వహించాలని పిలుపునివ •-వడంతో ప్రఝబుత్వం అప్రమత్తం అయ్యింది. పోలీస్‌ ‌శాఖను అప్రమత్తం చేసింది. కేంద్ర బ్జడెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని రైతు సంఘాలు విమర్శలు చేశాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను దిగ్బంధనం చేయనున్నాయి రైతు సంఘాలు. రైతుల ట్రాక్టర్‌ ‌ల ర్యాలీ సందర్భంగా గత నెల 26న దేశ రాజధానిలో హింస చెలరేగిన నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

సరిహద్దుల నుంచి రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది. అటు కనీస మద్ధతు ధరపై పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన చేసే అవకాశం అంటూ జాతీయ వి•డియాలో ప్రచారం జరుగుతోంది. రైతుల చక్కా జామ్‌ ‌నేపధ్యంలో గురువారం ప్రధానితో కేంద్ర మంత్రుల భేటీ జరిగింది. ఢిల్లీ పోలీసు కమిషనర్‌, ఇం‌టలిజెన్స్ ‌ఛీఫ్‌ ‌తో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సవి•క్షిస్తున్నారు. అమిత్‌ ‌షా నేతృత్వంలో అత్యంత ఉన్నతస్థాయి సవి•క్ష సమావేశం జరిగింది.

Leave a Reply