Take a fresh look at your lifestyle.

గొల్లపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, గురువారం గొల్లపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం. ఆటోలో చిక్కుకున్న మృత దేహాలు

  సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని గొల్లపల్లి గ్రామ శివారులో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. వివరాల్లోకి వెళ్లితే…మండలంలోని చాట్లపల్లికి చెందిన ఆటోను గొల్లపల్లి గ్రామ శివారులో తుఫాన్‌ ‌వాహనం ఢీకొట్టగా చాట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు తెలుసుకున్న గ్రామస్థులు మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు మృత దేహాలను తీయొద్దని  సంఘటన స్థలం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అయితే, పోలీసులు సముదాయించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ‌ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగదేవ్‌పూర్‌ ‌పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply