Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌తో ఆర్జెడి నేత తేజస్వి యాదవ్‌ ‌మంతనాలు

జాతీయ రాజకీయాల దిశగా కెసిఆర్‌ అడుగులు..?

హైదరాబాద్‌,‌జనవరి11: తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్‌ ‌మంతనాలు జరుపు తున్నారు. థర్డ్ ‌ఫ్రంట్‌ ‌దిశగా కేసీఆర్‌ ‌వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్‌, ‌లెప్ట్ ‌పార్టీల నేతలతో కేసీఆర్‌ ‌చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్‌ ‌ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. తేజస్వీ యాదవ్‌ ‌నేతృత్వంలోని ఆర్జేడీ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఆర్‌జేడీ నేత, బీహార్‌ ‌ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ ‌ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటి అయ్యారు. మంత్రి కేటీఆర్‌, ఎం‌పీ సంతోష్‌కుమార్‌ ‌తేజస్వీ యాదవ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

తేజస్వీ యాదవ్‌ ‌నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ భేటిలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్నపథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌, ఆర్‌జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్‌ ‌భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్‌ ‌సింగ్‌, ‌మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్‌లు ఈ భేటిలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆర్జేడీ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి అబ్దుల్‌ ‌భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్‌ ‌సింగ్‌, ‌మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్‌ ఉన్నారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కూడా పాల్గొన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌కు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ‌గట్టి పోటీ ఇచ్చారు. కాలం కలిసివస్తే తేజస్వీ యాదవ్‌ ‌సీఎం అయ్యుండేవారు.

Leave a Reply