Take a fresh look at your lifestyle.

నీటి రాజకీయాలు వద్దు… ప్రాంతాల అభివృద్ధే ముద్దు

నీరు పల్లమెరుగు,నిజం దేవుడెరుగు అనే సామెత  బహుళ ప్రాచుర్యం   పొందింది.    ఎన్ని ఆనకట్టలు కట్టినా, నీరు  పల్లపు ప్రాంతాలకే వెళ్తుంది. దానిని ఎవరూ ఆపలేరు. అలాగే,  నిజం కూడా  దాగదు.  పోతిరెడ్డి పాడు  హెడ్‌ ‌రెగ్యులేటర్‌ ‌సామర్ధ్యాన్ని   పెంచేందుకు  ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం   సాగిస్తున్న యత్నాలు చట్ట విరుద్ధం కాదు.  దివంగత నేత   వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి హయాంలోనే    కొంత ప్రయత్నం  జరిగింది. జగన్‌ ‌ప్రభుత్వం ఇప్పుడు తలపెట్టింది దానికి కొనసాగింపు మాత్రమే.  ఇది ముమ్మాటికీ నిజం. కానీ,  తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులకు   నిజం కన్నా,  రాజకీయం ముఖ్యం. పదవులు ముఖ్యం,. వారి  అవకాశ వాద వైఖరిని  తెరాస నాయకులు  ఒడుపుగా ఉపయోగించుకుని  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు.అది తప్పులేదు.

రాజశేఖరరెడ్డి హయాంలో, రోశయ్య, కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హయాంలో   సీమ ప్రాజెక్టులను సమర్దించిన   తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులు ఇప్పుడు    ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పై  ఆరోపణలు చేయడానికి ఈ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు.   నిజానికి   తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకుల కన్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగింది కేసీఆరే అని విశ్వసించడం వల్లనే  తెలంగాణ ప్రజలు ఆయనకు మళ్ళీ పట్టం కట్టారు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ నామమాత్రంగా మిగిలింది. చీలికలు, పీలికలైన ఆ పార్టీకి నాయకత్వం కోసం  ఉన్న  నాయకులు     రోజుకో రీతిలో  పరస్పరం  ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు.  తెలంగాణ ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరు.     ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అవకాశవాదమన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు.  విశాలాంధ్ర ఏర్పడిననాటి నుంచి  భారీ నీటి పారుదల శాఖను నిర్వహించిన వారిలో    80 శాతం తెలంగాణ వారే. ఆంధ్ర పాలకులు తమ నోళ్లు మూయించారని ఇప్పుడు   గగ్గోలు పెడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులు    మంత్రి పదవుల కోసమే నోళ్ళు కట్టుకున్నారన్న సంగతి  తెలంగాణ ప్రజలకు తెలుసు.

రాజశేఖరరెడ్డి   అధికారంలోకి వచ్చే వరకూ తెలంగాణలో  సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఇప్పుడు కేసీఆర్‌ ‌పూర్తి చేశానని చెప్పుకుంటున్న ప్రాజెక్టులన్నీ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం     50 శాతం పైగా పూర్తి చేసినవే. ఈ విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు.  ఇప్పుడు   పోతిరెడ్డి పాడు విషయంలో కేసీఆర్‌,  ఆం‌ధ్రప్రదేశ్‌  ‌ముఖ్యమంత్రి జగన్‌ ‌తో రాజీ పడ్డారని  పదే పదే ఆరోపిస్తున్న చల్లా వంశీచంద్‌ ‌రెడ్డి అప్పట్లో   వైఎస్‌ ‌వీరాభిమాని.       వైఎస్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా లకు ఆయన ఎప్పుడూ నోరు మెదపలేదు. ఈ విషయం   తెలం గాణ ప్రజలకు తెలుసు. ఆయన అవకాశ వాద వైఖరిని చూసి జనం నవ్వుకు ంటున్నారు. అలాగే,   కోమటిరెడ్డి సోదరులకు   ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వైఎస్‌ ‌ను   దివంగత సీనియర్‌ ‌నాయకుడు  పాల్వాయి గోవర్ధన రెడ్డి  బహిరంగంగానే విమర్శించేవారు. తెలంగాణకు కాంగ్రెస్‌ ‌నాయకుల వల్లే నష్టం జరిగింది కనుకనే    కేసీఆర్‌ ‌వారిని దూరంగా పెట్టగలిగారు. లేకపోతే ప్రజలు ఈ పాటికి  కేసీఆర్‌ ‌పై  తిరగబడి ఉండేవారు. కాంగ్రెస్‌ ‌నాయకులకు    ప్రాజెక్టుల కన్నా పదవులే ఎక్కువన్న సంగతి   జనానికి తెలుసు. పదవుల కోసమే కొట్లాడు కోవడం వారి సంస్కృతి. ఒక్క తెలం గాణలోనే కాదు, దేశమంతటా కాంగ్రెస్‌ ‌నాయకుల  తీరు అంతే. రాజస్థాన్‌ ‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు నిదర్శనం.   కాంగ్రెస్‌ ‌వారిని  విశ్వసిం• •లేకపోవడం వల్లనే    బీజేపీ, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌ను నడిపించే నాయకుడు లేడు.  పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గతంలో మాదిరి పార్టీని నడిపించే శక్తి లేదు. రాహుల్‌ ‌గాంధీది   విశ్రాంత రాజకీయం. హాలీడే మూడ్‌. అం‌దువల్ల  ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్న వారు సైతం దూరం అవుతున్నారు.    

కాంగ్రెస్‌ ‌పార్టీ ద్వారా పదవులు అనుభవించిన వారే  ఆ పార్టీకి ద్రోహం చేశారు.ఇప్పటికీ చేస్తున్నారు. ఇది రాజకీయ విమర్శ కాదు., ప్రతి కాంగ్రెస్‌ ‌వాదీ ఆత్మవిమర్శ చేసుకుంటే వచ్చే సమాధానం.   పోతిరెడ్డి పాడు  రిజర్వాయర్‌ ‌లో నీరు నిల్వ ఉంటే  తెలంగాణకు కూడా  మేలు అని అప్పట్లో అసెంబ్లీలో  చర్చ సందర్భంగా ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పుడు  తెలంగాణకు చెందిన ఒక్క కాంగ్రెస్‌ ‌నాయకుడు కూడా నోరు మెదపలేదు.  అయినా, పల్లంలోకి వచ్చే నీటిని  వాడుకుంటే ఎగువన ఉన్న ప్రాంతాలవారికి ఎలా నష్టమో లాజికల్‌ ‌గా అర్థం కాని విషయం.  నీరు వాడుకోకపోతే  సముద్రంలోకి పోతుంది.  గోదావరి నీటిని ఒడిసి పట్టడంలో కేసీఆర్‌ ‌ముందు చూపుతో వ్యవహరించారు. వ్యయం అంచనాలను పెంచేశారన్న విమర్శలను పక్కన పెడితే  (అవి ఏ ప్రభుత్వంలోనైనా ఉండేవే)   సముద్రంలోకి పోయిన గోదావరి నీటిని కేసీఆర్‌ ఒడిసి పట్టారన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఇప్పటికైనా   స్వార్థ రాజకీయాల కోసం నీటి వాటాలను ఉపయోగిం చుకోవడానికి స్వస్తి చెప్పితమ ప్రాం తాలను సస్య శ్యామలం చేసుకుంటే తెలుగు ప్రజలు హర్షిస్తారు. లేదంటే  మరింతగా తిరస్కరిస్తారు.

– స్వామి

Leave a Reply