Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌

781 ‌కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు నమోదు
మరోమారు తీవ్రంగా మారుతున్న పరిస్థితులు
అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ
జాగ్రత్తలు తీసుకోకుంటే ఒమిక్రాన్‌ ‌విజృంభించే ప్రమాదం : ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌దేశంలో రోజురోజుకూ ఒమిక్రాన్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కొరోనా కేసుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతుంది. తాజాగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య 781కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 127 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. వీరిలో 241 మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 238 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదు కాగా..మహారాష్ట్రలో 167 కేరళలో 65, తెలంగాణలో 62, గుజరాత్‌లో 73, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్నాటకలో 34, ఆంధప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ ‌కేసులు మొత్తం 781 కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241 మంది ఉన్నారు. మరోవైపు దేశంలో క్రమంగా ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదు కావడంతో ఆందోళన కలుగుతుంది. కోవిడ్‌ ‌కేసుల కంటే ఈ రోజు 44 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రాల వారీగా నమోదవుతున్న ఒమిక్రాన్‌ ‌కేసులు ఇలా వున్నాయి. ఢిల్లీలో 238 కేసులు..నమోదు కాగా రికవరీ అయినవారు 57గా నమోదయ్యారు. మహారాష్ట్రలో 167 కేసులకు 72మంది రికవరీ అయ్యారు. గుజరాత్‌లో 73 కేసులకు రికవరీ అయినవారు 17 మంది ఉన్నారు. కేరళలో 65 కేసులు నమోదు కాగా రికవరీ అయినవారు ఒకరుగా ఉన్నారు. తెలంగాణలో 62 కేసులు నమోదు కాగా రికవరీ అయినవారు 10 మంది, రాజస్తాన్‌లో 46 కేసులకు రికవరీ అయిన వారు 30 మంది, కర్నాటకలో 34 కేసులకు రికవరీ అయినవారు 18 మంది, తమిళనాడులో 34 కేసులకు రికవరీ అయినవారు 16మంది, హర్యానాలో 12 కేసులకు రికవరీ అయినవారు ఇద్దరు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ 11 ‌కేసుల్లో ఒక్కరు రికవరీ అయ్యారు. ఒమిక్రాన్‌ ‌కేసుల తీవ్రత నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి.

జనవరి 31 వరకూ ఆంక్షలు అమలులో వుంటాయి. అంతర్జాతీయంగా వొచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్‌ ‌చెయ్యాలని, ఆర్టిపిసిఆర్‌ ‌పరీక్షలను నిర్వహించాలని కేంద్రం సిఫార్సు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికుల పరిచయాలను నిశితంగా ట్రాక్‌ ‌చేసి పరీక్షించాలి. పాజిటివ్‌గా మారిన ప్రయాణికుల నమూనాలను వెంటనే జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌లాబొరేటరీలకు పంపాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇకపోతే దేశంలో కోవిడ్‌ ‌ముప్పు తొలగడం లేదు. గత కొంతకాలంగా తక్కువగా నమోదవు తున్న కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. క్రమంగా పెరుగుతున్న కోవిడ్‌ ‌కేసులు ఆందోళన పెంచు తున్నాయి. దేశంలో కొరోనా రోజువారీ కొరోనా కేసులు కూడా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,195 పాజిటీవ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో మంగళవారం నాటికంటే 44 శాతం అధికంగా కేసులు పెరిగాయి. కొరోనాతో మరో 302మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాదాటగా ఇప్పటివరకు దేశంలో 4,80,592మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 24 గంటల్లో కొరోనా నుంచి 7,347మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,002. యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. రాజధాని ఢిల్లీలో కొరోనా రూల్స్ ‌నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ ‌విధించిన కేజీవ్రాల్‌ ‌సర్కారు..మెట్రోతో పాటు బస్సులను 50 శాతం కెపాసిటీతో నడిపించాలని నిర్ణయించింది. మెట్రోల్లో నిల్చుని ప్రయాణించేందుకు కూడా అనుమతి నిరాకరించారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు బస్సులు, ఆటోల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆఫీసులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వందలాది సంఖ్యలో ప్రజలు బస్‌ ‌స్టాండులు, మెట్రో స్టేషన్ల ఎదుర బారిన తీరారు. తక్కువ సీటింగ్‌ ‌కెపాసిటీతో బస్సులు నడుస్తుండటంతో ప్రయాణికులకు వెయిటింగ్‌ ‌టైమ్‌ ‌పెరుగుతుంది. బస్సుల కోసం గంటల పాటు వేచి చూడాల్సి వొస్తుందని కొందరు ప్రయాణికులు వాపోతున్నారు. బస్‌ ‌స్టాండులు, మెట్రో స్టేషన్ల ఎదుట ప్రజలు బారులు తీరిన వీడియోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

జాగ్రత్తలు తీసుకోకుంటే ఒమిక్రాన్‌ ‌విజృంభించే ప్రమాదం : ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే దేశంలో ఒమిక్రాన్‌ ‌మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనిని కేంబ్రిడ్జి ప్రొఫెసర్‌ ఒకరు సమర్థించారు. గతనెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌ ‌కంటే ముందు వొచ్చిన డెల్టా వేరియంట్‌తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌ ‌సోకిన దేశాల్లో అది విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్‌లోకి కూడా ఈ వేరియంట్‌ ‌ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ ‌కేసులపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. డెల్టా వేరియంట్‌ ‌కంటే ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌శరవేగంగా విజృంభిస్తుందని, ఇప్పటికే యూకే, యూఎస్‌ ‌దేశాలలో ఒమిక్రాన్‌ ‌మరణాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించింది. డిసెంబర్‌ 20 ‌నుంచి 26 వరకు ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని, అంతే కాకుండా రానున్న 2-3 రోజుల్లో ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌పై జాగ్రత్త వహించాలని దేశాలకు సూచించనట్లు తెలిపింది. కేంబ్రిడ్జ్ ‌విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ‌పాల్‌ ‌కుట్టిమన్‌ ‌ట్రాకర్‌ ‌సర్వే ప్రకారం అతి త్వరలోనే ఇండియాలో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దీనికి ఉదాహరణ రోజువారి పెరుగుతున్న కేసులే అని తెలిపారు. రాబోయే వారంరోజుల వ్యవధిలో కేసులు భారీగా నమోదవుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తే థర్డ్‌వేవ్‌ ‌ముప్పునుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్‌ ‌పాల్‌ ‌తెలిపారు.

Leave a Reply