Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

  • తీవ్రమవుతున్న వడ గాల్పులు…రానున్న ఐదు రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు
  • ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రాష్ట్రంలో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, ‌మే నెలలో మరింత తీవ్రత తప్పదని హెచ్చరికలు వొస్తున్నాయి.  భగభగ మండే ఎండలకు ఏమైపోతామోనన్న టెన్షన్‌ ‌ప్రజల్లో నెలకొంది. హీట్‌వేవ్‌ అం‌తకంతకూ పెరుగుతుంది. మార్చి నెల చివరివారంలో పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తుంది. ఎండలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. రాగల 5 రోజుల్లో ఎండల తీవ్రత అక్కడక్కడ 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తాజా బులెటిన్‌లో పేర్కొంది. రాగల 5 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్‌ ‌వరకు అక్కడక్కడ పెరిగే అవకాశం ఉందని వాతావరణ  హెచ్చరికలు జారీ చేసింది.

విదర్భ నుండి ఉత్తర కేరళ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌నుండి తెలంగాణా వి•దుగా ఇంటీరియర్‌ ‌తమిళనాడు  వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9కిమి ఎత్తు వరకు కొనసాగుతుందని, ఏప్రిల్‌ 1,2 ‌తేదీలలో రాష్ట్రంలోని వాయువ్య జిల్లాలలో వడగాలులు వొచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో పదేళ్ల రికార్డు బద్దలై ఆదిలాబాద్‌ ‌జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీ చేసింది. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు.

Leave a Reply