Take a fresh look at your lifestyle.

మోడీ పాలనలో పెరిగిన ఆయిల్ ధరలు

  • సామాన్యుడికి గుది బండ గా మారిన వంటగ్యాస్
  • వందరూపాయలు దాటిన పెట్రోల్
  • కార్పొరేట్ రంగానికి మేలు చేస్తున్న మోడీ 
  • ముఖ్యమంత్రి కేసీఆర్ పై బురద చల్లడం మానుకోండి
  • పట్టబద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -

పెరిగిన ఆయిల్ ధరలతో ప్రజలు అతలా కుతులం అవుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. మోడీ పాలనలో సామాన్యుడికి గ్యాస్ బండ గుది బండగా మారిందని ఆయన పేర్కొన్నారు. వంద దాటుతున్న పెట్రోల్ ధర పెరిగిన డీజిల్ ధరలే మోడీ మార్క్ పాలనకు నిదర్శనాలని ఆయన ఎద్దేవాచేశారు.
నల్లగొండ,ఖమ్మం, వరంగల్ శాసనమండలి పట్టబద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలతో సామాన్యులు సతమౌతున్న కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.పేదోడిని కొట్టి కార్పొరేట్ శక్తుల కడుపు నింపడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందన్నారు.గతంలో బ్యారెల్ ధర 107 ఉన్నప్పుడు కూడా ఇంతగా  రేట్లు పెరగలేదని ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అదే బ్యారెల్ ధర 57 కు తగ్గితే కూడా ఆయిల్,వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడం లో ఔచిత్యమేమిటని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఇదంతా మోడీ అసమర్థ పాలనతో జరుగుతుందన్న వాస్తవాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై బురద చల్లడం మానుకోవాలని  విపక్షాలకు ఆయన హితవు పలికారు.

విలువలకు కట్టుబడి ఉన్నందునే గులాబీ శ్రేణులు హుందాగా నడుచుకుంటున్నాయన్న నిజాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన విపక్షాలను హెచ్చరించారు.మాట నిలబెట్టుకోవడం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మించిన నాయకుడు ఇప్పట్లో లభించదని అటువంటి నాయుడిపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణా ఏర్పడ్డాకే చెరువుల పునరుద్ధరణ జరిగిందని తద్వారా రాష్ట్రంలో భూములన్నీ సస్యశ్యామలం గా మారాయన్నారు.విపక్షాలు తమకు తామే పెద్దగా ఊహించుకుని ఉరేగుతున్నాయని అటువంటి పార్టీలకు జనబాహుళ్యంలో ఆదరణ లభించిందని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థ పై చూపిందని అన్ని సర్దుకున్నందున హామీల అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని ఆయన తెలిపారు. శాసన మండలి ఎన్నికల్లో టి ఆర్ యస్ గెలుపు ఆవశ్యకత ను టి ఆర్ యస్ పార్టీ లీడర్, క్యాడర్ ఓటర్లకు వివరించాలని ఆయన కోరారు.పట్టభద్రుల సమస్యలపై శాసన మండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి గట్టి పట్టు ఉందని అటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటేనే సమస్యలు పరిష్కరించబడతాయని ఆయన చెప్పారు.

శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణా రాష్ట్రం ఆర్థికాభివృద్ధి లో 14.2%తో యావత్ భారత దేశంలోనే మూడో స్థానాన్ని అక్రమించిందన్నారు.ఇది ఎవరో చెప్పింది కాదని బిజెపి కి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాహారంగంగ ప్రకటించారన్నారు.ఇక్కడి బిజెపి నాయకులు మాత్రం అవేమి పట్టించుకోకుండా నోటికి ఏది వస్తే అది అడ్డు అదుపు లేకుండా మాట్లాఫుతున్నారన్నారు.గడిచిన ఆరు ఏండ్లలో లక్షా 31 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని ఆయన కొనియాడారు. మరో 60 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని రేపో మాపో ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అంతే గాకుండా టి యస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 14,800 ల పరిశ్రమలు నెలకొల్పేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల 50000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. దీనితో తెలంగాణా రాష్ట్రంలో నిరుద్యోగ శాతం తగ్గుమొహం పట్టిందని కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు వెల్లడించిన నివేదికలే ఇందుకు ఆధారమని ఆయన చెప్పారు. శాసన మండలి సభ్యుడిగా గడిచిన ఆరు ఏండ్లుగా పట్టబద్రుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేశానన్నారు.

సభలో అవకాశం వచ్చినప్రతి సారి పట్టబద్రుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి చేరేలా చర్చకు పెట్టిన ఉదంతాన్ని ఆయన వివరించారు.మరొక మారు ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో గెలిపించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లను అభ్యర్దించారు.యింకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గుప్తా,రాష్ట్ర కార్యదర్శి వై వి,డిసియంయస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్ టి ఆర్ యస్ నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి,పెద్దిరెడ్డి రాజా,జుట్టుకొండ సత్యనారాయణ, గండూరీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply