భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయంటున్న వైద్య నిపుణులు
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: భారత దేశంలోని పిల్లలలో ఊబకాయం పెరిగిపోతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటున్నదనీ, ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ఊబయాకం, దాని దుష్ప్రభావాలపై ఇండో యూఎస్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా.శరత్చంద్ర, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డా.ఎన్జి శాస్రి, డయాబెటిక్ బేరియాట్రిక్, మెటబాలజిస్ట్ డా.సురేంద్ర ఉగలే మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ భారతీయులుగా మనం ఇప్పటికే హైపర్టెన్షన్, డయాబెటిస్, హార్ట్ డిసీస్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నామనీ, వీటికి జతగా ఊబకాయం కూడా చేరినట్లయితే ఆరోగ్య సమస్యలు మరింత పెరిగిపోయే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
14.4 మిలియన్ల ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలతో భారతదేశం ప్రపంచంలోనే ఊబకాయంతో బాధపడుతున్న చైనా తరువాతి స్థానంలో నిలచిందన్నారు. తీవ్ర ఊబకాయం ఉన్న వ్యక్తులలో పురుష/ల అయితే 20 ఏళ్లు, స్త్రీలు అయితే 5 ఏళ్ల ఆయుర్ధాయం తగ్గుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏ వయసు పిల్లలకు ఆ వయసులో ఇవ్వాల్సిన సమతుల ఆహారాన్ని ఆ వయసులో ఇవ్వడంతో పాటు జంక్ ఫుడ్ తీసుకోకుండా జాగ్రత్త పడినట్లయితే పిల్లలను ఆరోగ్యవంతులుగా ఉంచవచ్చని వారు పేర్కొన్నారు.