Take a fresh look at your lifestyle.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశం
  • అప్రమత్తమైన అధికారులు

ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీరు కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మంగళవారం ఉదయం 34 అడుగులు ఉన్న గోదావరి సాయంత్రానికి 39 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. బుధవారం ఉదయం నాటికి
40 అడుగులు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రానికి 43 అడుగులకు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వరద ప్రభావం పెరగటంతో జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మరింత వరద పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సెక్టోరియల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. మూడవసారి వరద ప్రభావం రావడంతో రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే వేస్తున్న వరి, ప్రత్తి, మిరప నారుమనులు వరద ప్రభావానికి ఇప్పటికే కుళ్ళీపోయాయి. అధికారులు నష్టాన్ని అంచనా వేసే సమయంలో మళ్ళీ వరద ప్రభావం రావడంతో రైతాంగం భయాంధోళనలో పడ్డారు. అప్పులు చేసి వేసుకున్న పంటలు పూర్తిగా కుళ్ళిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉండటం వలన ప్రాజెక్టులు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో వరద నీటిని క్రిందికి వదులుతున్నారు. దీనికారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌
‌భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రేపటికీ లేదా ఎల్లుండి వరకు 60 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ ‌డా ఎంవి రెడ్డి తెలిపారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న  వర్షాలకు పేరూరు మరియు తాలిపెరు వద్ద ఉధృతి  పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు.  సిడబ్ల్యుసి అంచనాకు మించి నీటి మట్టాలు మరింత పెరుగుతున్నందున అధికారులు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రక్రియ పై దృష్టి పెట్టాలని చెప్పారు.  ముఖ్యంగా గోదావరికి ఇరువైపులా  ఎడమ  ఏడు మండలాల్లో  సహాయక చర్యలు మనకు  సవాలుగా మారబోతున్నాయని చెప్పారు. కాబట్టి వరద పరిస్తులను ఎదుర్కోవడానికి మనమందరం  సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు.

Leave a Reply