Take a fresh look at your lifestyle.

తెలంగాణలో పెరుగుతున్న కొరోనా కేసులు

అప్రమత్తం అయిన వైద్యాధికారులు
‌తెలంగాణలో కొరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ, టిమ్స్ హాస్పిటల్స్ అధికారులతో డీఎంఈ రమేష్‌రెడ్డి భేటీ అయ్యారు. కోవిడ్‌ ‌రోగులను చేర్చుకునేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. దవాఖానాల్లో సౌకర్యాలు, పడకల అందుబాటుపై చర్చించారు. కొరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకోవడంతో కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా కేసులను చూసి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 రాష్టాల్లో్ర కొరోనా వైరస్‌ ‌మళ్లీ విజృంభిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఢిల్లీ, గుజరాత్‌, ‌కర్ణాటక, హర్యానా, కేరళ రాష్టాల్లో్ర కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Leave a Reply