తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 54,330గా ఉంది. కరోనాతో మరో 14 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 615కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 464, వరంగల్ అర్బన్ జిల్లా 187, మేడ్చల్ జిల్లా 138, కరీంనగర్ జిల్లా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పాజిటివ్
తెలంగాణలో ప్రజాప్రతినిధులను కొరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు వైరస్ సోకగా తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్దారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు •ం క్వారంటైన్లో ఉన్నారు.
కొరోనా బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతాం : టీడీపీ నేత ఎల్.రమణ
కొరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై
పోరాడతామని టీడీపీ నేత ఎల్.రమణ స్పష్టం చేశారు. శనివారం డియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్షాలపై పెట్టే కేసులకు భయపడేది లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులపై ప్రజలకు లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు కొరోనా చికిత్సను ప్రభుత్వమే ఉచితంగా అందించాలన్నారు. తలసాని లాంటి మంత్రులను కేసీఆర్ పక్కన పెట్టుకోవటం అన్యాయమని ఎల్.రమణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.